Grenade Attack : పుల్వామాలో భద్రతా దళాలపై గ్రనేడ్ దాడి

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు.

Grenade Attack : పుల్వామాలో భద్రతా దళాలపై గ్రనేడ్ దాడి

Pulwama

Updated On : September 14, 2021 / 3:18 PM IST

Grenade Attack జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మంగళవారం భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఇవాళ మధ్యాహ్నం పుల్వామా చౌక్ వద్ద భద్రతా దళాల వాహనం వైపు ఉగ్రవాదులు గ్రనేడ్‌ను విసిరారు. అయితే గ్రెనేడ్ రోడ్డు పక్కన పేలింది.

ఈ ఘటనలో నలుగురు పౌరులు గాయపడ్డారు. గాయపడినవారిని ట్రీట్మెంట్ కోసం స్థానిక హాస్పిటల్ కి తరలించనట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులని పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఇటీవల కాలంలో కశ్మీర్‌లో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడులు పెరిగాయి. గత వారం పుల్వామాలోని చనాపోరా ప్రాంతంలో జరిగిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం కూడా బిజీగా ఉండే పరిమిపిరా-పంథాచౌక్ వద్ద ఉగ్రవాదులు దాడికి పాల్పడేందుకు సిద్ధం చేసిపెట్టిన ఆరు గ్రనేడ్‌లను భద్రతా దళాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి.