GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వస్తువుల రేట్లు భారీగా తగ్గాయ్.. ఇక నుంచి నెలవారి ఖర్చులో ఉపశమనం..

GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్‌న్యూస్. ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తులపై రేట్లను తగ్గించాయి.

GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాలకు భారీ గుడ్‌న్యూస్.. ఈ వస్తువుల రేట్లు భారీగా తగ్గాయ్.. ఇక నుంచి నెలవారి ఖర్చులో ఉపశమనం..

GST Reforms

Updated On : September 19, 2025 / 12:11 PM IST

GST Reforms : పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్‌న్యూస్. చిన్నచిన్న ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులు భారం అవుతున్నాయని భావించే వారికి ఇకనుంచి కాస్త ఉపశమనం లభించనుంది. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయిస్తూ ఎఫ్ఎంసీజీ కంపెనీలు తమ ఉత్పత్తులపై కొత్త రేట్లను తగ్గించాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఉపయోగించే పలు రకాల వస్తువుల చౌక ధరలకు అందుబాటులోకి రానున్నాయి.

Also Read: Apple iPhone 17 Sale : ఆపిల్ ఐఫోన్ 17 సేల్ మొదలైందోచ్.. కొత్త ఐఫోన్ కోసం స్టోర్ల వద్ద ఎగబడుతున్న జనం.. పొట్టు పొట్టు కొట్టేసుకున్నారు..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా శ్లాబుల్లో మార్పులు చేసింది. కేవలం 5శాతం, 18శాతం శ్లాబులు మాత్రమే ఉంటాయి. దీంతో జీఎస్టీ రేట్ల కోతకు అనుగుణంగా ఈనెల 22 నుంచి తమ ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థలు ప్రకటించాయి. వీటిలో షాంపూలు, సబ్బులు, టూట్ పేస్టులు, టూత్ బ్రష్ లు, రేజర్లు, బేబీ డైపర్లు తదితర ఉత్పత్తులకు సంబంధించి రేట్లు భారీగా తగ్గనున్నాయి.

జీఎస్టీ రేట్లు సవరించిన నేపథ్యంలో ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌ హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (HUL) తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది.
♦ డోవ్ షాంపూ (340మి.లీ.) ధర రూ.490 నుంచి రూ.435కు తగ్గనుంది.
♦ డోవ్‌ సబ్బు (75గ్రా) ధర రూ.45 నుంచి రూ.40కి తగ్గనుంది.
♦ క్లినిక్‌ ప్లస్‌ షాంపూ (355 మి.లీ.) ధర రూ.393 నుంచి రూ.340కి తగ్గనుంది.
♦ సన్‌సిల్క్‌ షాంపూ (350 ఎంఎల్) ధర రూ.430 నుంచి రూ.370కి తగ్గనుంది.
♦ లైఫ్‌బాయ్‌ సబ్బులు (నాలుగు సబ్బులు, 75 గ్రా) ధర రూ.68 నుంచి రూ.60కి తగ్గనుంది.
♦ లక్స్‌ గ్లో (నాలుగు 75గ్రా) ధర రూ.96 నుంచి రూ.85కు తగ్గనుంది.
♦ క్లోజ్‌అప్‌ టూత్‌పేస్ట్‌ ధర రూ.145 నుంచి రూ.129కు తగ్గనుంది.
♦ హార్లిక్స్‌ చాకొలేట్‌ (200 గ్రా) ధర రూ.130 నుంచి రూ.110కి తగ్గనుంది.
♦ బూస్ట్‌ (200గ్రా) ధర రూ.124 నుంచి రూ.110కి తగ్గనుంది.
♦ కిస్పాన్‌ కెచప్‌ (850గ్రా) ధర రూ.100 నుంచి రూ.93కు తగ్గనుంది.
♦ కిసాన్‌ జామ్‌ (200గ్రా) ధర రూ.90 నుంచి రూ.80కి తగ్గనుంది.
♦ బ్రూ కాఫీ (75గ్రా) ధర రూ.300 నుంచి రూ.270కి తగ్గనుంది.

ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ ఉత్పత్తుల..
♦ విక్స్‌యాక్షన్‌ 500 అడ్వాన్స్, ఇన్‌హేలర్‌ ధర రూ.69 నుంచి రూ.64కు తగ్గనుంది.
♦ హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ కూల్‌ మెంథాల్‌ (300 మి.లీ.) ధర రూ.360 నుంచి రూ.320కి తగ్గనుంది.
♦ హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ స్మూత్‌ అండ్‌ సిల్కీ (72 మి.లీ.) ధరను రూ.89 నుంచి రూ.79కి తగ్గనుంది.
♦ ప్యాంటీన్‌ షాంపూ (340 ఎంఎల్‌) ధరను రూ.410 నుంచి రూ.355కు తగ్గనుంది.
♦ గిల్లెట్‌ షేవింగ్‌ క్రీమ్‌ (30 గ్రా) ధరను రూ.45 నుంచి రూ.40కి తగ్గనుంది.
♦ షేవింగ్‌ బ్రష్‌ ధర రూ.85 నుంచి రూ.75కు తగ్గనుంది.
♦ ఓల్డ్‌స్పైస్‌ షేవింగ్‌ లోషన్‌ (150 మి.లీ.) ధర రూ.320 నుంచి రూ.284కు తగ్గనుంది.
♦ ఓరల్‌ బి టూత్‌బ్రష్‌ ధర రూ.35 నుంచి రూ.30కు తగ్గనుంది.

ఇమామీ ఉత్పత్తులు ఇలా..
♦ బోరోప్లస్‌ యాంటీ సెప్టిక్‌ క్రీమ్‌ (80 మి.లీ.) ధర రూ.165 నుంచి రూ.155కు తగ్గనుంది.
♦ నవరత్న ఆయిల్‌ (180 మి.లీ.) ధర రూ.155 నుంచి రూ.145కు తగ్గనుంది.
♦ డెర్మికూల్‌ ప్రిక్లీహీట్‌ పౌడర్‌ ధర రూ.159 నుంచి రూ149కి తగ్గనుంది.
♦ జండూబామ్‌ (25మి.లీ.) ధర రూ.125 నుంచి రూ.118కి తగ్గింది.
♦ జండూ చవన్‌ప్లస్‌ (900 గ్రా) ధర రూ.385 నుంచి రూ.361కి తగ్గనుంది.
♦ బోరోప్లస్‌ సబ్బుల (ఆరు 125గ్రా) ధర రూ.384 నుంచి రూ.342కు తగ్గనుంది.

ఇవేకాక పేద, మధ్య వర్గాల ప్రజలు నిత్యం ఉపయోగించే పలు వస్తువుల ధరలు ఈనెల 22వ తేదీ నుంచి తగ్గనున్నాయి.