Performed Last Rites: 300 మందికి అంత్యక్రియలు చేశాడు.. చివరికి

Performed Last Rites
Performed Last Rites: కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉంది. సెకండ్ వేవ్ లో మరణాల రేటు పెరిగింది. కేసులు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. పల్లె పట్నం అనే తేడా లేకుండా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే 300లకు పైగా కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. హర్యానా రాష్ట్రం హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రవీణ్ కుమార్ (44) ఉద్యోగం చేస్తున్నారు.
కరోనా మృతదేహాలను దహనం చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బృదానికి ప్రవీణ్ కుమార్ అధిపతి. కరోనా వెలుగు చూసిన నాటినుంచి కోవిడ్‌తో మృత్యువాతపడిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. భయమనేది లేకుండా 300లకు పైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ఇటీవల కరోనా బారినపడ్డారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతి చెందాడు.
ఎంతో మందికి అంతిమ సంస్కారాలు చేసిన ప్రవీణ్ మృతి చెందడం స్థానికులను కలచివేస్తోంది. ప్రవీణ్ అంత్యక్రియలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిసర్ మేయర్ ఆధ్వర్యంలో రిషినగర్‌లో మంగళవారం జరిపారు. ఇక ప్రవీణ్ కుటుంబంలోని చాలామంది ఇదే మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు. వారుకూడా కరోనా మృతదేహాలను తరలించడం, అంత్యక్రియలు చేయడం వంటి పనులు చేస్తున్నారు.