Cheetah project : చీతా ప్రాజెక్ట్ నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల ఆందోళన

భారతదేశంలోని కునో నేషనల్ పార్కులో చీతాల ప్రాజెక్టు నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీతాలను మెరుగ్గా పర్యవేక్షించడం, సకాలంలో వైద్య సంరక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే చీతాల మరణాలు సంభవించాయని దక్షిణాఫ్రికా వెటర్నరీ వైల్డ్ లైఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అడ్రియన్ టోర్డిఫ్,అతని సహచరులు పేర్కొన్నారు....

Cheetah project : చీతా ప్రాజెక్ట్ నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల ఆందోళన

Cheetah project

Cheetah project : భారతదేశంలోని కునో నేషనల్ పార్కులో చీతాల ప్రాజెక్టు నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీతాలను మెరుగ్గా పర్యవేక్షించడం, సకాలంలో వైద్య సంరక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే చీతాల మరణాలు సంభవించాయని దక్షిణాఫ్రికా వెటర్నరీ వైల్డ్ లైఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అడ్రియన్ టోర్డిఫ్,అతని సహచరులు పేర్కొన్నారు.

Ukrainian Detainees Tortured : యుక్రెనియన్ ఖైదీలపై రష్యా దళాల లైంగిక వేధింపులు…మొబైల్ జస్టిస్ టీం నివేదిక వెల్లడి

నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 20 చీతాలను గత ఏడాది సెప్టెంబరు నెలలో భారతదేశానికి ప్రత్యేక విమానాల్లో తరలించారు. (Cheetah project) అనంతరం గత ఏడాది డిసెంబరు 17వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులోకి విడుదల చేశారు. చీతాలు కునో పార్కులోకి వదిలేసినప్పటి నుంచి ఐదు పెద్ద చీతాలు, మరో మూడు చీతాల కూనలు మరణించాయి.

Gurugram clashes : గురుగ్రామ్‌లో హింసాకాండ…మళ్లీ వర్క్ ఫ్రం హోం

జులై 15వతేదీన రేడియో కాలర్ గాయాల కారణంగా దక్షిణాఫ్రికా చీతాలు తేజస్, సూరజ్ మరణించాయని దక్షిణాఫ్రికా వెటర్నరీ వైల్డ్ లైఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అడ్రియన్ టోర్డిఫ్ సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. (foreign experts tell SC) చీతాల ప్రాజెక్టు నిర్వహణ చూస్తున్న అధికారులకు సరైన శాస్త్రీయ శిక్షణ లేదని, వీరు అంతర్జాతీయ చీతాల వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం లేదని విదేశీ పశువైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.

మన ఎమ్మెల్యేల ఆస్తులు చూస్తే షాకవ్వాల్సిందే…ఏడీఆర్,ఎన్ఈడబ్ల్యూ రిపోర్టులో సంచలన వాస్తవాలు

అంతర్జాతీయ నిపుణులైన తమను చీతాల ప్రాజెక్టు స్టీరింగ్ కమిటీలో నియమిచినప్పటికి భారత అధికారులు తమను ఎప్పుడూ సమావేశాలకు పిలవ లేదని, చీతాల సంరక్షణ విషయంలో తమను సంప్రదించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కునో పార్ వద్ద చిరుత మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రేడియో కాలర్లు కునో పార్కులో చిరుతలను చంపుతున్నాయని విదేశీ నిపుణులు చెప్పారు.

Seema -Sachin Love Story : సీమాహైదర్‌ను పాక్ తిరిగి పంపిస్తారా? యూపీ సీఎం యోగి ఏమన్నారంటే…

చీతాల ప్రాజెక్టు వైఫల్యం, చీతాల మృతిపై దక్షిణాఫ్రికా వెటర్నరీ వైల్డ్ లైఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అడ్రియన్ టోర్డిఫ్ తన సహచరుల తరపున సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. చీతాల నిపుణుడు విన్సెంట్ వాన్ డెర్ మెర్వే, విదేశీ వన్యప్రాణి పశువైద్యులు డాక్టర్ ఆండీ ఫ్రేజర్, డాక్టర్ మైక్ టాఫ్ట్ లు డాక్టర్ అడ్రియన్ టోర్డిఫ్ కలిసి చీతాల ప్రాజెక్టు వైఫల్యంపై సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై 2020వ సంవత్సరం జనవరి నెలలో సుప్రీంకోర్టు చిరుత ప్రాజెక్ట్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. చీతాల ప్రాజెక్టు వైఫల్యం తమను నిరుత్సాహ పర్చిందని విదేశీ వైద్యనిపుణులు చెప్పారు.