మా అమ్మతో మాట్లాడించండి : ట్విట్ కు స్పందించిన రైల్వేశాఖ

మా అమ్మతో మాట్లాడించండి : ట్విట్ కు స్పందించిన రైల్వేశాఖ

Updated On : October 1, 2019 / 7:16 AM IST

రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ శబ్ధం కారణంగానో.. నెట్‌వర్క్ సమస్య మూలంగానో ఫోన్ కాల్స్‌లలో బయటి వ్యక్తులతో మాట్లాడలేం. అది ఎంత ముఖ్యమైన విషయమైనప్పటికీ ప్రయాణికులను కాంటాక్ట్ చేయడం బయట ఉన్నవారికీ కొందరికి కుదరకపోవచ్చు. ఇదే సమస్య ఓ యువకుడికి ఎదురైంది. తనకు సహాయం కావాలంటూ భారత రైల్వేను ట్విట్టర్ ద్వారా కోరాడు. 

సమాచారం అందుకున్న క్షణాల్లోనే స్పందించిన రైల్వే ఎట్టకేలకు పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని యువకుడి తల్లితో మాట్లాడే ఏర్పాటు చేశారు. రైల్వే సిబ్బంది స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ట్విట్టర్లో సోమవారం రాత్రి ఇలా పోస్టు చేశాడు. 

‘రైలులో ప్రయాణిస్తున్న నా తల్లి షీలా పాండేతో కమ్యూనికేట్ అవడం కుదరడం లేదు. ఆమె 12988 రైలు నెంబర్ అజ్మర్-స్దాహ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుంది.  28-09-2019న బయల్దేరిన రైల్లో ఎస్ 5కోచ్‌లో ఉంది. రైలు 12గంటలు ఆలస్యంగా వెళ్తుంది. సార్ నాకు ఓ సాయం చేయండి. అక్కడ ఆమె ఆరోగ్యంగానే ఉందనే విషయం తెలుసుకుందామనుకుంటున్నా’ అని సాశ్వత్ ట్వీట్ చేశాడు. 

దీనిపై కొద్ది నిమిషాల్లోనే రైల్వే స్పందించింది. ఆమె ఎక్కడ ఎక్కింది, ఎప్పుడు ఎక్కిందనే వివరాలు తెలియజేయండి అని రిప్లై వచ్చింది. వాటికి సాశ్వత్ స్పందించడంతో ఆ తల్లితో కొడుకు మాట్లాడగలిగాడు. చివరకు తనకూ సాయం చేసినందుకు రైల్వేకు థ్యాంక్స్ అని ఆ కుర్రాడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.