ఢిల్లీలో ‘టీ’పార్టీ లాగానే ‘గోమూత్ర పార్టీ’..వెళితే ఫ్రీగా ఇస్తారట

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 04:59 AM IST
ఢిల్లీలో ‘టీ’పార్టీ లాగానే ‘గోమూత్ర పార్టీ’..వెళితే  ఫ్రీగా ఇస్తారట

Updated On : March 14, 2020 / 4:59 AM IST

అఖిల భారతీయ హిందూ మహాసభ శనివారం (మార్చి 14,2020) గోమూత్ర పార్టీ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్లు వైరల్ గా మారాయి. హిందూ మహాసభ, జన్ జాగరణ్ మంచ్, యూత్ సనాతన్ సేవా సంఘ్ ఈ పార్టీని నిర్వహిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఈ పార్టీ ప్రారంభమవుతుంది. కరోనా వైరస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 

కరోనా వైరస్‌‌ను సమర్ధవంతంగా నిరోధించడంలో గోవు మూత్రం, పేడ, ఇతర ఉత్పత్తులు ఎంతోఉపయోగపడతాయని హిందూ మహాసభ‌కు చెందిన చక్రపాణి మహరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపిన విషయంత తెలిసిందే. జనం ఎలా అయితే ‘టీ’ పార్టీలు ఏర్పాటు చేస్తుంటారో..అలాగే గోమూత్ర పార్టీ ఏర్పాటు  చేస్తున్నామని..ఈ పార్టీకి వచ్చేవారందరికీ  గోమూత్రాన్ని సరఫరా చేస్తామని చక్రపాణి చెప్పారు.

ఈ పార్టీలో గోవు పేడతో తయారు చేసిన కేక్‌లు, అగర్‌బత్తీలు ప్రదర్శిస్తామని చెప్పారు. ఇటువంటి గోమూత్ర పార్టీలు ఇతర రాష్ట్రాల్లో కూడా నిర్వహిస్తామని చక్రపాణి మహరాజ్ వివరించారు.కరోనా వైరస్ ను నియంత్రించటానికి చేసే యుద్ధంలో గోమూత్రం కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. కాగా హిందూ మహాసభ ‘గోమాత్ర పార్టీ’ అంటూ వేసిన పోస్టర్లు చూసిన ప్రజలు కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. మరికొంతమంది వింతగా చూస్తున్నారు. 

Also Read | జనసేన పార్టీ.. ప్రశ్నిస్తా అంటూ మొదలై.. ఏడవ వసంతంలోకి!