Holi 2022 : హోలీ ఆడుతున్నారా? మీ కళ్లు జాగ్రత్త.. ఈ చిట్కాలు పాటించండి..!
Holi 2022 : హోలీ.. హోలీ.. రంగుల హోలీ వచ్చేసింది.. కలర్ ఫెస్టివల్... అంతా రంగులమయం.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఆడుకునే రంగుల పండుగ హోలీ.

Holi 2022 Beware Of These Respiratory, Skin, Eye Issues While Playing Holi
Holi 2022 : హోలీ.. హోలీ.. రంగుల హోలీ వచ్చేసింది.. కలర్ ఫెస్టివల్… అంతా రంగులమయం.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఆడుకునే రంగుల పండుగ హోలీ. ఈ హోలీ పర్వదినాన రంగులతో హోలీ ఆడుతుంటారు. అయితే ఈ హోలీ రంగుల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం గుర్తించుకోవాలి. చాలామందికి అలెర్జీ సమస్యలు ఉంటాయి. రంగుల హోలీ ఆడే సమయంలో వారికి ఇరిటేషన్ కలిగించే అవకాశం ఉంది. మరికొంతమందిలో జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల అలెర్జీల నుంచి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వరకు ఆరోగ్య సమస్యలు వస్తాయి.
హోలీ రంగులలో హానికరమైన పదార్ధాలను ఉంటాయి. ఆర్గానిక్ రంగులు అయితే పర్వాలేదు. కానీ, కెమికల్ కలిసి ఉండే హోలీ రంగులతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు చర్మ నిపుణులు. ముఖ్యంగా మీ చర్మంతో పాటు కళ్ళు, శ్వాసకోశ వ్యవస్థపై రంగుల రసాయన ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సేంద్రీయ రసాయన రహిత రంగులతో అనారోగ్య సమస్యలు ఉండవని సూచిస్తున్నారు. రంగులో హోలీ ఆడే ముందు పిల్లలు, పెద్దలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ కళ్లను, చర్మాన్ని రక్షించుకోవచ్చు.
హోలీతో కలిగే ఆరోగ్య సమస్యలు ఇవే :
శ్వాసకోశ సమస్యలు :
హోలీ రంగుతో శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. రంగు నోటిలోకి ప్రవేశిస్తే.. ఆస్తమా, బ్రోన్కైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి అనారోగ్య సమస్యలు రావచ్చు. దాంతో శ్వాసలోపం, దగ్గు శ్లేష్మం (కఫం) ఉత్పత్తికి దారితీస్తుంది. క్రోమియం బ్రోన్కైటిస్ ఏర్పడుతుంది. రంగులలో వాడే రసాయన పదార్థాలు మన అంతర్గత అవయవాలైన మూత్రపిండాలు, కాలేయం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రంగులు ఆడే సమయంలో ఏదైనా సమస్య ఎదురైతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

Holi 2022 Beware Of These Respiratory, Skin, Eye Issues While Playing Holi
కంటి అలర్జీలు :
హోలీ రంగులు చర్మానికి కళ్ళకు హానికరమని గుర్తించాలి. రంగుల్లో వాడే ఆస్బెస్టాస్, సిలికా, మైకా సీసం వంటి ప్రమాదకర రసాయనాలు ప్రమాదకరం. అందుకే కళ్లలోకి రంగు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలెర్జీలు, కార్నియల్ రాపిడి వల్ల కండ్లకలకలు రావొచ్చు. అలాగే కంటి గాయాలు ఏర్పడి కంటి సమస్యలు రావొచ్చు. అలర్జీతో కళ్ళు ఎర్రబడడం, వాపు, నీరు కారడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రసాయనాలు కంట్లోకి వెళ్తే తీవ్రమైన మంటను కలిగిస్తుంది. ఈ రంగుల వల్ల కలిగే ప్రమాదాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు.
స్కిన్ ఇన్ఫెక్షన్లు :
“హోలీ రంగులలో భారీ లోహాలతో పాటు పగిలిన గాజు ముక్కలు, రసాయనాలను వాడుతారు. హోలీ ఆడిన తర్వాత చాలామందిలో చర్మ ఇన్ఫెక్షన్లు, చర్మ అలర్జీలు లేదా కాంటాక్ట్ డెర్మటైటిస్, దద్దుర్లు, దురదలు, మంటలు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు.
నివారణ చిట్కాలు :
* హోలీ ఆడే ముందు ఆర్గానిక్ రంగులను ఉపయోగించండి. మీ చర్మాన్ని తేమగా లేదా నూనెగా మార్చుకోండి.
* మంచి సన్‌స్క్రీన్, కళ్లకు సన్‌గ్లాసెస్ ఉపయోగించండి లెన్స్‌లు ధరించకుండా ఉండండి.
* మీ కళ్లను తాకడం లేదా వాటిని రుద్దడం మానుకోండి. ఎందుకంటే చికాకు లేదా ఇతర కంటి సమస్యలకు దారితీస్తుంది.
* నిండు చేతుల బట్టలు ధరించండి, మీ కళ్లను రుద్దకండి. బెలూన్లను ఉపయోగించకుండా ఉండండి.
* రంగులతో ఆడిన తర్వాత, రంగులు తొలగించేందుకు డిటర్జెంట్, స్పిరిట్, నెయిల్ పాలిష్ రిమూవర్, ఆల్కహాల్ లేదా అసిటోన్లను ఉపయోగించవద్దు.
* డాక్టర్ సిఫార్సు చేసిన సబ్బును మాత్రమే ఉపయోగించండి, కానీ, స్క్రబ్ చేయవద్దు చర్మాన్ని తేమగా ఉంచుకోండి.
Read Also : Safe Holi : హోలీ..ఆనంద కేళీ, సహజ రంగులే మేలు