యూపీలో చనిపోయింది 11మంది.. పోలీసుల లెక్కల్లో ఆరుగురే

యూపీలో చనిపోయింది 11మంది.. పోలీసుల లెక్కల్లో ఆరుగురే

Updated On : December 21, 2019 / 2:37 AM IST

కొత్త పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మృతుల సంఖ్య 11కి చేరింది. ఐదు రోజుల నుంచి జరుగుతూనే ఉన్న ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరిపారు. రెండ్రోజులుగా తీవ్రరూపం దాల్చుతుండటంతో వారణాసిలోని 8సంవత్సరాల చిన్నారితో కలిపి 48గంటల్లో 12కు చేరింది. హాస్పిటల్ వర్గాలు వెల్లడించినప్పటికీ అడిషనల్ డీజీపీ రామశాస్త్రి కేవలం ఆరుగురు మాత్రమే చనిపోయారని అసలు కాల్పులే జరపలేదని చెప్పుకొస్తున్నారు. 

3వేల 305మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 200మందిని అరెస్టు చేశారు. ఔరంగబాద్, మహారాష్ట్రలలో 72గంటలపాటు 144సెక్షన్ అమలులో ఉంది. 21జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. శుక్రవారం ఫిరోజాబాద్, గోర‌ఖ్‌పూర్‌, కాన్పూర్,మీరట్, బులంద్‌షెహ‌ర్ లో నిర‌స‌న‌కారులు పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. వాహ‌నాల‌కు నిప్పుపెట్టారు. బులంద్‌షెహ‌ర్ లో ఆందోళనకారులపై పోలీసులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. 

పలువురు ఆందోళనకారులతో పాటుగా పోలీసులు కూడా గాయపడ్డారు. ఆందోళనకారులపై లీఠీ చార్జ్ కూడాచేశారు. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో కూడా అల్ల‌ర్లు జ‌రిగాయి. లక్నో, కాన్పూర్, అలహాబాద్, ఆగ్రా, అలీగఢ్,  ఘజియాబాద్, వారణాసి, మధుర, మీరట్, మొరాదాబాద్, ముజఫర్ నగర్, బరేలీ, ఫిరోజాదాద్, పిలిభిత్, రాంపూర్, సహారన్పూర్, షామ్లీ, సంభల్, అమ్రోహా, మౌ, అజమర్ ప్రాంతాలలో జరిగిన ఆందోళనలలో 12మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం పోలీసులు జరిపిన కాల్పులేనని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.

మరోవైపు ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దర్యాగంజ్ ఏరియాలో ఆందోళనకారులు ఇవాళ ఓ కారుకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కానన్స్ ను ఉపయోగిస్తున్నారు.