Greater Noida: దేశ రాజధానిలో విపత్కర ఘటన.. వరద నీటిలో మునిగిపోయిన వందలాది కార్లు

హిండన్‌లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారి ఇళ్ల నుంచి అనేక మందిని ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి

Greater Noida: దేశ రాజధానిలో విపత్కర ఘటన.. వరద నీటిలో మునిగిపోయిన వందలాది కార్లు

Updated On : July 25, 2023 / 8:26 PM IST

Hindon River: కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతాన్ని వర్ష భీబత్సం ముంచెత్తింది. అయితే ఆ ప్రమాదం నుంచి బయటపడ్డట్టే అని అనుకున్నప్పటికీ, ఇంకా బయటపడలేదనే చెప్పాలి. ఎందుకంటే నోయిడాలో ఒక విపత్కర పరిస్థితి వెలుగు చూసింది. హిండన్ నది నీటి మట్టం పెరిగి గ్రేటర్ నోయిడాలోని ఓపెన్ గ్రౌండ్‌లో ఉన్న 200కి పైగా కార్లు పైకప్పుల వరకు మునిగిపోయాయి. గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో చిత్రీకరించబడిన ఈ వీడియో, వరుస క్రమంలో పార్క్ చేసిన తెల్లటి కార్లు పైకప్పుల వరకు మునిగిపోయి ఉండడం చూడొచ్చు.

Manipur Violence: మణిపూర్‭లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ మీద నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. కానీ కండిషన్స్ అప్లై

హిండన్‌లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారి ఇళ్ల నుంచి అనేక మందిని ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, ఢిల్లీ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) ఎగువన ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయిలో ఉంది. ఇకపోతే, హిండన్ నది యమునా నదికి ఉపనది.

Nirmaan Org: సైబరాబాద్ కమిషనరేట్‌ పోలీసులకు 1200 రెయిన్‌కోట్‌ల పంపిణీ

దీనికి ముందు భారత వాతావరణ శాఖ (IMD) శాస్త్రవేత్త ఆర్‌కె జెనామణి ఒక సందర్భంలో స్పందిస్తూ “ఢిల్లీకి సంబంధించి వర్షపాతం హెచ్చరిక లేదు. కానీ అధిక తేమ, అధిక ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఢిల్లీకి ఎటువంటి హెచ్చరిక లేదు. కానీ జూలై 25 రాత్రి నుంచి కొన్ని వర్షాలు మొదలవుతాయి” అని అన్నారు.

Eatala Rajender : వాళ్లు వదిలిపెట్టరు, ప్రతీకారం తీర్చుకుంటారు.. సీఎం కేసీఆర్‌కు ఈటల రాజేందర్ హెచ్చరిక

మహారాష్ట్ర, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతం, మధ్య మహారాష్ట్ర, గోవా, కోస్తా కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ అంచనా వేసింది. గుజరాత్‌లో గత 24 గంటల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.