RT LAMP Kit : కొత్త కిట్.. అరగంటలోపే ఒమిక్రాన్ ఫలితాలు, ఖర్చు కూడా తక్కువే..!

ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ ఫలితాలు త్వరగా వచ్చేలా ఐసీఎంఆర్ కొత్త కిట్ రూపొందించింది. RT-LAMP అనే కిట్ ద్వారా నిపుణుల అవసరం లేకుండా సులభంగా కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని, అరగంట..

RT LAMP Kit : కొత్త కిట్.. అరగంటలోపే ఒమిక్రాన్ ఫలితాలు, ఖర్చు కూడా తక్కువే..!

Rt Lamp Kit

Updated On : December 8, 2021 / 5:42 PM IST

RT LAMP Kit : ఒమిక్రాన్ వేరియంట్ టెస్ట్ ఫలితాలు త్వరగా వచ్చేలా ఐసీఎంఆర్ కొత్త కిట్ రూపొందించింది. RT-LAMP అనే కిట్ ద్వారా నిపుణుల అవసరం లేకుండా సులభంగా కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని, అరగంటలోపే రిజల్ట్స్ వస్తాయని తెలిపింది. ఇది వందశాతం సమర్థంగా పని చేస్తుందని, కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని తెలిపింది. మరో రెండు వారాల్లో ఈ కొత్త అందుబాటులోకి రానుంది.

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు హెచ్చరించడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఒమిక్రాన్ భయంతో విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు అధికారులు కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Army Chopper Crash : బిపిన్ రావత్ మినహా హెలికాఫ్టర్ లోని అందరూ మృతి

అయితే, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడానికి, ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతోంది. దీంతో ఎయిర్ పోర్టుల్లో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ ఫలితాలు త్వరగా వచ్చేలా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ విభాగం ఆర్‌టీ-లాంప్‌(RT-LAMP) కొవిడ్‌ కిట్‌ను ఆవిష్కరించింది. నిపుణుల అవసరం లేకుండా సులభంగా ఈ కిట్‌తో కరోనా పరీక్షలు నిర్వహించవచ్చని.. ఫలితాలు అరగంటలోపే వస్తాయని ఐసీఎంఆర్‌ తెలిపింది.

Cyber Attack : ఇంట్లో అద్దెకు వస్తామని రూ.2 లక్షలు కాజేశారు

”ఆర్‌టీ-లాంప్‌ వందశాతం సమర్థంగా పని చేస్తుంది. కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. ఇతర కొవిడ్‌ పరీక్షల కంటే ఈ ఆర్‌టీ-లాంప్‌ పరీక్షకు 40శాతం తక్కువ ఖర్చవుతుంది. వీటిని భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయడం కోసం ఢిల్లీ, చెన్నైలోని పలు కంపెనీలకు నమూనాలు పంపించాం. మరో రెండు వారాల్లో ఈ కొత్త కొవిడ్‌ కిట్‌ అందుబాటులోకి వస్తుంది. ఎయిర్ పోర్టులతో పాటు ఓడరేవులు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌లలో ప్రయాణికులకు పరీక్షలు చేసేందుకు ఉపయుక్తంగా ఉంటాయి” అని ఐసీఎంఆర్‌ వివరించింది.