సింగపూర్ లో భర్త సంపాదన….తమిళనాడులో భార్య రాసలీలలు

  • Published By: murthy ,Published On : September 30, 2020 / 04:32 PM IST
సింగపూర్ లో భర్త సంపాదన….తమిళనాడులో భార్య రాసలీలలు

Updated On : September 30, 2020 / 5:04 PM IST

illegal affair woman: కుటుంబ పోషణ కోసం పెళ్లాం పిల్లలను వదిలి భర్త సింగపూర్ లో కష్టపడుతుంటే…..తమిళనాడులో భార్య తన ప్రియుడితో రాసలీలలు ఆడుతోంది. తన రంకు బాగోతాన్ని భర్తకు చెపుతానన్న ఇంటి ఓనరమ్మను ప్రియుడి తో హత్య చేయించింది.




తమిళనాడులోని నాగై జిల్లా సీర్గాళిలో  ప్రభుత్వ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఆనందజ్యోతి (55) తన భార్య చిత్ర(49) పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. వీరిది సొంతిల్లు. కింది భాగంలో ఆనంద జ్యోతి నివసిస్తుండగా..పైన ఉన్న డబుల్ బెడ్ రూం పోర్షన్ రామ్ ,బృంద(29) అనే యువ దంపతులకు అద్దెకు ఇచ్చారు. వీరికి 3 సంవత్సరాల పాప ఉంది. రామ్ ఉద్యోగ రీత్యా సింగపూర్ వెళ్లి అక్కడ ఉంటున్నాడు. సింగపూర్లో రామ్ కష్టపడి డబ్బులు సంపాదించి తమిళనాడులోని భార్య బృంద కు పంపిస్తూ పిల్లను బాగా చూసుకోమని చెప్పేవాడు.tamilnadu brunda ఇంట్లో ఉంటే ఏమీ తోచటం లేదని బృంద కంప్యూటర్ నేర్చుకోటానికి ఒక ఇనిస్టిట్యూట్ లో చేరింది. అక్కడ ఆమెకు సయ్యద్ రియాజుద్దీన్ అనే (29) తన కాలేజీ మేట్ పరిచయం అయ్యాడు. వాస్తవానికి రియాజ్ కాలేజీ రోజుల్లోనే బృందను ప్రేమించాడు.  కాలేజీ రోజుల్లోనే ఇద్దరూ  ప్రేమ లోకంలో విహరించారు. కానీ ఇద్దరి మతాలు వేరు కావటంతో ఆ రోజుల్లో పెళ్లి చేసుకునే ధైర్యం చేయలేకపోయారు.




ఆనాటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఇప్పడూ ఇద్దరూ ప్రేమ మైకంలో మునిగిపోయారు. రూప భర్త సింగపూర్ లో ఉంటున్నాడని తెలుసుకున్న రియాజ్ ఇంక బృంద ఇంటికి వచ్చిపోతున్నాడు. భర్త సింగపూర్ లో ఉండటం అడిగేవాళ్లు ఎవరూ లేకపోవటంతో బృంద, రియాజ్ లు శృంగార లోకంలో విహరించసాగారు.

రియాజ్ తమిళ్ టాప్ హీరో విజయ్ ఫ్యాన్స్ క్లబ్ లో  కీలక పదవిలో ఉన్నాడు. నాగై జిల్లా హీరో విజయ్ మూమెంట్ కు సయ్యద్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇది కాక ఇతర వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారం పనుల నిమిత్తం పేరుతో రియాజ్,  బృంద ఉంటున్న సిర్గాళికి ఎక్కువగా వచ్చి వెళుతున్నాడు, వచ్చినప్పుడుల్లా బృందతో కలిసి రాస లీలలల్లో పాల్గోంటున్నాడు. పైగా హీరో విజయ్ ఫ్యాన్స్ కూడా అవటంతో తన ప్రియురాలితో కలిసి ఇంట్లో డ్యూయెట్లుకు డ్యాన్స్ లు కూడా చేస్తు హీరో హీరోయిన్లుగా ఊహలోకంలో విహరిస్తున్నారు.




ప్రియుడ్ని ఇంటికి పిలిపించుకుని బృంద అతడితో విచ్చల విడిగా ఎంజాయ్ చేయటం మొదలెట్టింది. బహిరంగంగా వారు చేస్తున్న చేష్టలు చూసిన ఇరుగు, పోరుగు వారు చిత్రకు కంప్లయింట్ చేశారు. బృంద వేషాలను ఎప్పటి నుంచో గమనిస్తున్న ఇంటి యజమానురాలు చిత్ర కూడా ఇరుగు పొరుగు వారు అభ్యంతరాలు చెప్పటంతో బృంద మీద కోపం వచ్చింది.
mayiladuthurai-women-murderనీ భర్త విదేశాల్లో ఉన్నాడు. నువ్వు ఇంటికి  ఎవరెవరినో తీసుకు వస్తే ఊరుకునేదిలేదని…చుట్టు పక్కల వారు అభ్యంతరం చెప్పారని చెప్పింది. నువ్వు సక్రమంగా ఉంటే, ఇంట్లో ఉండు, లేదంటే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో…. నీ చేష్టలు మీ ఆయనకు చెపుతానని హెచ్చరించింది. బృంద ప్రియుడు రియాజ్ ను కూడా చిత్ర హెచ్చరించింది. తాను ప్రియుడితో కలిసి చేస్తున్నవ్యవహారాలు ఎక్కడ తన భర్తకు చెపుతుందోనని బృంద భయపడిపోయింది. ప్రియుడు రియాజ్ కూడా చిత్ర హెచ్చరికలకు భయపడ్డాడు.




తమ గుట్టు ఎక్కడ బయట పడిపోతుందోనని ప్రేయసి ప్రియులు భయపడ్డారు. తమ అక్రమ సంబంధానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో లేరు. మాజీ ప్రియురాలిని వదులుకునే  స్టేజిలో రియాజ్ లేడు.   భర్తకు దూరంగా ఉన్న బృంద మాజీ ప్రియుడితో  పొందుతున్న సుఖాన్ని వదులుకోలేక పోయింది. ఏం చేయాలా ఆని ఆలోచించారు. చిత్రను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

రెండు సార్లు చిత్రను హత్య చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ అవేవి సాధ్యం కాలేదు. చిత్ర  ప్రతిరోజు తెల్లవారు ఝూమున ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. అప్పుడు హత్య చేయాలని డిసైడ్ అయ్యారు. తెల్లవారు ఝూమున చీకటిగా ఉంటుంది. ఎవరికీ తెలియదు…. తేలిగ్గా తప్పించుకోవచ్చు. తన ప్లాన్ అమలు చేయవచ్చని డిసైడ్ అయ్యాడు. riyaz vijay fans సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి రియాజ్ బృంద ఇంట్లోనే  ఉన్నాడు. 18వ తేదీ శుక్రవారం తెల్లవారు ఝూమున చిత్ర ఇంటి ముందు ముగ్గువేయటానికి బయటకు వచ్చింది. ఇదే అదనుగా భావించిన రియాజ్ ముగ్గు వేయటానికి వంగిన చిత్ర తల మీద ఇనుపరాడ్ తో బలంగా కొట్టాడు. దీంతో చిత్ర నేలకొరిగింది.  నేలమీద పడిపోయిన చిత్ర తలమీద మరిన్ని దెబ్బలు వేసి రియాజ్ పరారయ్యాడు. రియాజ్ కొట్టిన దెబ్బలకు కుప్ప కూలిన చిత్ర ఇంటి ముందే ప్రాణాలు విడిచింది.




కొద్ది సేపటి తర్వాత చిత్ర హత్యకు గురైన విషయాన్ని  ఇంటి సభ్యలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని  సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి రియాజ్ ను గుర్తించారు. రియాజ్ చిత్ర ఇంట్లో అద్దెకుండే బృంద ప్రియుడిగా పోలీసులు గుర్తించారు.
hero vijay fans memberబృంద రియాజ్ లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. నిందితులిద్దరూ నేరాన్ని ఒప్పుకున్నారు. పగలు హత్య చేస్తే తెలిసి పోతుందని…  తెల్లవారుఝూమున ఐతే అందరూ నిద్రమత్తులో ఉంటారు. చీకటిగా ఉంటుదని ఆ సమయాన్ని ఎంచుకున్నామని వివరించారు. అక్రమ సంబంధాన్ని అడ్డకున్న పాపానికి హెడ్ మాస్టర్ ఆనందజ్యోతి భార్య చిత్ర హత్యకు గురవటం… హత్య చేసిన వ్యక్తి హీరో విజయ్ ప్యాన్స్ క్లబ్ నాయకుడు కావచం తమిళనాడులో కలకలం రేపింది.