IMD Alert: జులై 21వరకూ కుండపోత వర్షాలు
జులై 21వ తేదీ వరకూ వర్షాలు తగ్గే అవకాశం లేదని అంటోంది వాతావరణ శాఖ(IMD). చాలా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. బెంగాల్, సిక్కింగ్ రాష్ట్రాల్లో జులై 19వరకూ భారీగా కురిసి క్రమంగా తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

Imd Alert
IMD Alert: జులై 21వ తేదీ వరకూ వర్షాలు తగ్గే అవకాశం లేదని అంటోంది వాతావరణ శాఖ(IMD). చాలా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. బెంగాల్, సిక్కింగ్ రాష్ట్రాల్లో జులై 19వరకూ భారీగా కురిసి క్రమంగా తగ్గు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
పశ్చిమ పెనిన్సులార్ ఇండియాలో రానున్న ఐదారు రోజులు వర్షానికి తడిచి ముద్దవ్వాల్సిందే. మధ్య మహారాష్ట్రలోని ప్రాంతాలైన కొంకణ్, గోవా, ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి.
పశ్చిమ హిమాలయ ప్రాంతం మీదుగా ఉత్తరప్రదేశ్ లోనూ 17జులై నుంచి 21జులై వరకూ పంజాబ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఉత్తర మధ్యప్రదేశ్ లలో 18 జులై, 21 జులై భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రానున్న 24గంటల్లో ఉరుములతో కూడి పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొద్ది రోజుల క్రితం పిడుగుపాటుకు గురై దాదాపు 90కి పైగా ప్రాణాలు కోల్పోయారు.