Budget 2025 : కేంద్ర బడ్జెట్‌లో బాదం హల్వా లాంటి న్యూస్.. హింట్ ఇచ్చిన ముర్ము, మోదీ.. ఇన్ కం ట్యాక్స్ లో..

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్ట‌నున్న బ‌డ్జెట్‌లో సామాన్యులు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు ఊర‌ట ల‌భించవ‌చ్చున‌ని తెలుస్తోంది. ఆదాయ‌పు ప‌న్ను రిబేట్ ఇంకా చాలా..

Budget 2025 : కేంద్ర బడ్జెట్‌లో బాదం హల్వా లాంటి న్యూస్.. హింట్ ఇచ్చిన ముర్ము, మోదీ.. ఇన్ కం ట్యాక్స్ లో..

Updated On : January 31, 2025 / 7:01 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ లో మధ్యతరగతి, సామాన్యుల కోసం గుడ్ న్యూస్ రాబోతున్నట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇద్దరూ దీనికి సంబంధించిన హింట్ ఇచ్చారు. ఈ రోజు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతి ప్రజల మీద ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

ఆ తర్వాత బడ్జెట్ సెషన్స్ ప్రారంభం సందర్భంగా పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ స్పీచ్ లో ముర్ము కూడా కీలక కామెంట్స్ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల కలలను సాకారం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాబట్టి ఈ రెండింటినీ బేరీజు వేస్తే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

Sonia Gandhi Remarks : గిరిజన బిడ్డను రాయల్ ఫ్యామిలీ అవమానించింది- రాష్ట్రపతిపై సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని మోదీ

కేంద్ర బడ్జెట్ నుంచి ఏమేం రావొచ్చు?

ఏడాదికి రూ.15 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ లో రిలీఫ్
పాత ఆదాయపన్ను విధానంలో మార్పులు
క్యాపిటల్ గెయిల్స్ ట్యాక్స్ సిస్టమ్ సరళతరం చేయడం
కొత్త ఆదాయపన్ను విధానంలో HRAని యాడ్ చేయడం
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ రూ.75000 ఉంది. దీన్ని లక్షకు పెంచడం
కొత్త పన్ను విధానంలో సీనియర్ సిటిజన్లకు కొత్త స్లాబ్స్
ఏడాదికి రూ.20 లక్షలు ఆపై ఆదాయం ఉన్నవారిని 30శాతం ట్యాక్స్ స్లాబ్ లోకి తీసుకోవడం
హోమ్ లోన్లకు వడ్డీ మీద ఆదాయపన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం
పాత ఆదాయపన్ను విధానం పూర్తిగా రద్దు చేయడం
ఆదాయపన్ను రిబేట్ పరిమితి పెంచడం
పాత ఆదాయపన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్స్ ని మార్చడం
కొత్త ఆదాయపన్ను విధానంలో ట్యాక్స్ మినహాయింపు పరిమితి పెంచడం