Corona Vaccination : భారత్‌ మరో రికార్డు.. ఒక్కరోజే కోటి మందికిపైగా టీకా.. ఇది 5వ సారి

కరోనావైరస్ మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అర్హులందరికీ టీకాలు అందేలా ప్రణాళికలు రచించి వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ క

Corona Vaccination : భారత్‌ మరో రికార్డు.. ఒక్కరోజే కోటి మందికిపైగా టీకా.. ఇది 5వ సారి

Corona Vaccination

Updated On : September 28, 2021 / 4:39 PM IST

Corona Vaccination : కరోనావైరస్ మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసింది. అర్హులందరికీ టీకాలు అందేలా ప్రణాళికలు రచించి వ్యాక్సినేషన్‌ను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భారత్ మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. సోమవారం ఒక్క రోజే కోటి మందికి పైగా క‌రోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ తెలిపారు. సోమ‌వారం 1,00,96,142 మంది టీకా వేయించుకున్నట్లు ఆయ‌న ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఒకే రోజు కోటి మందికి పైగా టీకా వేయించుకోవ‌డం ఇది ఐదోసారి. ఈ సంద‌ర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజే 35 లక్షల మంది టీకా తీసుకున్నారు.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్

మన దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 86 కోట్లు దాటినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కాగా.. సెప్టెంబ‌ర్ 17న ప్రధాని జన్మదినం సందర్భంగా నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో 2 కోట్ల మంది టీకా తీసుకుని రికార్డు సృష్టించారు. తొలిసారిగా ఆగ‌స్టు 27న కోటి మంది టీకాలు తీసుకున్నారు. అక్టోబ‌ర్ రెండో వారం వ‌ర‌కు 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇవ్వాల‌ని కేంద్ర ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని అక్టోబ‌ర్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో చేరుకునే అవ‌కాశం ఉంది.

Bank Holidays: అక్టోబరులో బ్యాంకులకు 21రోజుల పాటు సెలవులు

దేశంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలు ఇచ్చారు. ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్లు ఇచ్చారు. మార్చి 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా 60ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వడం ప్రారంభించారు.