Rahul Gandhi: ‘ఇండియా హిందువుల దేశం.. హిందూత్వవాదులది కాదు’

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆదివారం జైపూర్ లోని బహిరంగ సభలో పాల్గొని బీజేపీని తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా ఇందన ధరలు ఆకాశాన్నంటాయని చెప్తూనే మతపరమైన....

Rahul Gandhi: ‘ఇండియా హిందువుల దేశం.. హిందూత్వవాదులది కాదు’

Rahul Gandhi

Updated On : December 12, 2021 / 5:28 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఆదివారం జైపూర్ లోని బహిరంగ సభలో పాల్గొని బీజేపీని తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా ఇందన ధరలు ఆకాశాన్నంటాయని చెప్తూనే మతపరమైన విమర్శలకు దిగారు.

‘ఇండియా హిందువుల దేశం. హిందూత్వవాదుల దేశం కాదు. ద్రవ్యోల్బణంలో నష్టాలు కేవలం హిందూత్వవాదుల వల్ల జరిగిందే. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అధికారాన్ని మాత్రమే కోరుకుంటారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ.. అతని స్నేహితులతో కలిసి దేశాన్ని నాశనం చేశారన్నారు. మోడీ గారూ.. అతని ముగ్గురు నలుగురు పారిశ్రామికవేత్తలైన స్నేహితులు కలిసి ఏడేళ్లుగా దేశాన్ని పాడు చేశారు. నేను హిందువును. హిందూత్వవాదిని కాదు’ అని చెప్పారు రాహుల్.

……………………..: అసలే వాలు కళ్ళు.. ఆపై మత్తు చూపు!