India Covid Update : భారత్ లో కొత్తగా 1260 కోవిడ్ కేసులు నమోదు
దేశంలో కొత్తగా నిన్న 1,260 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,27,035కు చేరింది. ఇందులో 4,24,92,326 మంది కోవిడ్ నుంచి కోల

India Coivd Update
India Covid Update : దేశంలో కొత్తగా నిన్న 1,260 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,27,035కు చేరింది. ఇందులో 4,24,92,326 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరో 5,21,264 మంది కోవిడ్ తదితర కారణాల వల్ల చనిపోయారు.
దేశంలో ప్రస్తుతం 13,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 83 మంది కోవిడ్ కారణంగా మరణించగా…, 1,404 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా, మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, 98.76 శాతం మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read : Valimai: వలిమై ప్రభంజనం.. 7 రోజుల్లో 500 మిలియన్ల ట్రీమింగ్ మినిట్స్!
రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతమని తెలిపింది. ఇక 79.02 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నది. నిన్న ఒక్కరోజే 5,28,021 మందికి కరోనా టెస్టులు చేశామని వెల్లడించింది. ఇప్పటివరకు 1,84,52,44,856 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.