ఈడెన్ గులాబీ కేళీ : భారత్ VS బంగ్లాదేశ్ డై నైట్ టెస్టు

బ్లాక్ బస్టర్ పింక్ బాల్ టెస్ట్‌కు.. కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతోంది. క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ 2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం జరగనుంది. భారత్, బంగ్లా మధ్య జరిగే ఈ చరిత్రాత్మక మ్యాచ్‌కు.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌తో పాటు పింక్ బాల్ కూడా రెడీ అయింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటు దేశంలోని క్రీడా ప్రముఖులంతా.. ఈ మ్యాచ్‌కు హాజరుకానున్నారు. ఫ్లడ్ లైట్ల కింద జరగబోయే పింక్ బాల్ మ్యాజిక్ చూసేందుకు.. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
పింక్ టెస్ట్ ఎఫెక్ట్‌తో.. ఇప్పటికే కోల్‌కతా మొత్తం పింక్ సిటీగా మారిపోయింది. ఈడెన్ గార్డెన్స్ చుట్టుపక్కల ఉన్న అధికారిక భవనాలు, పార్కులు, బ్రిడ్జిలన్నీ పింక్ లైట్లతో మెరిసిపోతున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈడెన్ గార్డెన్స్‌లో తొలి డే అండ్ నైట్ మ్యాచ్ వీక్షించనున్నారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు చాలా మంది మాజీ కెప్టెన్లు కూడా వస్తున్నారని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ చెప్పారు. 2000 సంవత్సరంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ ఆటగాళ్లంతా హాజరుకానున్నారు. వీరితో పాటు మేరీ కోమ్, పీవీ సింధు, అభినవ్ బింద్రా, సానియా మీర్జా, పుల్లెల గోపిచంద్, భజరంగ్ పునియా లాంటి మరికొందరు క్రీడా ప్రముఖులు ఈడెన్ గార్డెన్స్‌లో కనిపించనున్నారు.
భారత్, బంగ్లాదేశ్ టీమ్‌లు.. ఇంతకుముందెప్పుడూ ఫ్లడ్ లైట్ల కింద టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఇప్పుడున్న బంగ్లాదేశ్ టీమ్‌కు.. పింక్‌బాల్‌తో ఇది తొలి మ్యాచ్. ఐతే.. టీమిండియా ఆటగాళ్లలో షమీ, వృద్ధిమాన్ సాహా, చటేశ్వర్ పుజారా, కుల్దీప్ యాదవ్, హనుమ విహారికి.. ఫ్లడ్ లైట్ల కింద పింక్ బాల్‌తో ఆడిన అనుభవముంది. బంగ్లాదేశ్‌తో.. తొలి టెస్టును 3 రోజుల్లోనే ముగించేసింది కోహ్లీ సేన. దీంతో.. ఈ పింక్ టెస్ట్‌ను రెండు టీమ్‌లు సవాల్‌గా తీసుకున్నాయి. తొలి డే అండ్ నైట్ మ్యాచ్ కోసం.. భారత్, బంగ్లా జట్లు పింక్ బాల్‌తో బాగా ప్రాక్టీస్ చేశాయి.
ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న డే అండ్ నైట్ టెస్ట్‌ను.. తొలుత సాధారణ టెస్ట్ మ్యాచ్ లాగే నిర్వహించాలనుకున్నారు. కానీ.. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీయే దీనిని డే అండ్ నైట్ మ్యాచ్‌గా మార్చారు. ఇందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కూడా ఒప్పించారు. తొలి డే అండ్ నైట్ టెస్ట్ అనగానే.. క్రికెట్ లవర్స్‌లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో.. టికెట్లన్నీ.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అంతా.. తొలి డే అండ్ నైట్ మ్యాచ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.
Read More : ఓ థర్డ్ అంపైర్.. అది నో-బాల్ : పాక్ ఫ్యాన్స్ ఫైర్