సెల్యూట్ ఇండియన్ ఆర్మీ: పాకిస్తాన్ తూటాల నుంచి పిల్లలను కాపాడిన జవాన్లు

  • Published By: madhu ,Published On : September 14, 2019 / 01:39 PM IST
సెల్యూట్ ఇండియన్ ఆర్మీ: పాకిస్తాన్ తూటాల నుంచి పిల్లలను కాపాడిన జవాన్లు

Updated On : September 14, 2019 / 1:39 PM IST

ఓ వైపు కాల్పులు..మరోవైపు చిన్నారులు..వీరందరినీ భారత సైనికులు సేఫ్‌ ప్లేస్‌కు తరలించారు. విద్యార్థుల బ్యాగులు ఒకరు మోస్తూ..మరొకరు విద్యార్థులను ఎత్తుకుని ఎత్తైన ప్రదేశం గుండా సైనికులు వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారులను సైనిక వాహనంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏమి జరుగుతుందోనన్న భయం చిన్నారుల్లో కనిపించింది. మొత్తానికి అందరినీ క్షేమంగా తరలించడంతో ఆర్మీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన బాల్ కోట్ సెక్టార్‌లో చోటు చేసుకుంది. 

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంకు తూట్లు పొడుస్తూనే ఉంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతోంది. భారత జవాన్లు తిప్పికొడుతున్నారు. బాల్ కోట్ సెక్టార్‌లో సెప్టెంబర్ 14వ తేదీ శనివారం పాక్ సైనికులు కాల్పులు జరిపారు. సందోట్ గ్రామంలో ప్రభుత్క పాఠశాల ఉంది. అందులో పలువురు విద్యనభ్యసిస్తున్నారు. కాల్పులు స్టార్ట్ కావడంతో ఆర్మీ అధికారులు అలర్ట్ అయ్యారు.

Read More : దేశంలో ఫస్ట్ టైమ్ : లారీకి రూ. 6లక్షల ఫైన్
వెంటనే స్కూల్‌కు చేరుకుని..అందులో ఉన్న చిన్నారులను రక్షించే ప్రయత్నం చేశారు. చిన్నారులు ముందుకు వెళుతుండగా..వారి వెనుక జవాన్లు పయనించారు. నడవలేకుండా..ఆయాసం పడుతున్న విద్యార్థులను జవాన్లు ఎత్తుకున్నారు. ముందుగానే రెడీ చేసిన ఆర్మీ వాహనంలో వీరందరినీ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇలాగే మరొక్క స్కూల్ నుంచి విద్యార్థులను సేఫ్ ప్లేస్‌కు తరలించారు.