Hamas attack : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి గురించి భారత సైన్యం ఆరా

ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి ఘటనపై భారత సైన్యం ఆరా తీస్తోంది. ఇజ్రాయెల్‌ లక్ష్యాలపై హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. అక్టోబర్ మూడో వారంలో జరగనున్న భారత ఆర్మీ కమాండర్ల సదస్సులో కూడా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు.....

Hamas attack : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి గురించి భారత సైన్యం ఆరా

Hamas attack

Updated On : October 11, 2023 / 9:52 AM IST

Hamas attack : ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి ఘటనపై భారత సైన్యం ఆరా తీస్తోంది. ఇజ్రాయెల్‌ లక్ష్యాలపై హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. అక్టోబర్ మూడో వారంలో జరగనున్న భారత ఆర్మీ కమాండర్ల సదస్సులో కూడా ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని సీనియర్ ఆర్మీ అధికారి వెల్లడించారు. హమాస్ చేసిన ఉగ్రదాడిని అంచనా వేయడంలో ఇజ్రాయెల్ ఏజెన్సీల వైఫల్యాలపై ఇండియన్ ఆర్మీ దృష్టి సారించింది.

Also Read :Israel war : ఇజ్రాయెల్ చేరిన అమెరికా ఆయుధ విమానం…యుద్ధంలో 3వేలమంది మృతి

గూఢచార విభాగం సమాచార సేకరణలో విఫలమవడాన్ని కూడా భారత సైనిక బలగాలు అధ్యయనం చేస్తున్నాయి. పాలస్థీనా ఉగ్రవాద సంస్థ హమాస్ అక్టోబర్ 7వతేదీన దక్షిణ ఇజ్రాయెల్‌లో రాకెట్ దాడులను ప్రారంభించింది. ఈ దాడుల్లో 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 900 మంది మరణించగా, మరో 2,600 మంది గాయపడ్డారు.

Also Read : Earthquake : అప్ఘానిస్థాన్ దేశంలో మళ్లీ భూకంపం

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించగా, మరో 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఉగ్రదాడిని మోదీ ఖండించారు. ఇజ్రాయెల్‌లోని భారతీయులకు భద్రత కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.