నెటిజన్ల సెటైర్లు : పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 05:58 AM IST
నెటిజన్ల సెటైర్లు : పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ

Updated On : February 26, 2019 / 5:58 AM IST

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో హ్యాపీ దివాళీ అనే హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదేంటి ఇప్పుడు దివాళీ అని ట్రెండ్ అవడం ఏంటి? అనుకుంటున్నారా? ట్విట్టర్ వేదికగా నెటిజన్లు పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ అని చెబుతున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత నావికాదళం పాకిస్తాన్ పై వెయ్యి బాంబులతో విరుచుకు పడిన సంగతి తెలిసిందే.
Also Read : మిరాజ్ యుద్ధ విమానాల దాడి.. లైవ్ వీడియో చూడండి

ఈ క్రమంలో భారత నెటిజన్లు పాకిస్తాన్ పై వెటకారం చేస్తూ హ్యాపీ దివాళీ అనే హ్యాష్ ట్యాగ్ వాడుతూ పాకిస్తాన్ ను ట్రోల్ చేస్తున్నారు. పాకిస్తాన్ కు భారత్ సరైన రీతిలో సమాధానం చెప్పిందంటూ ట్విట్టర్ వేదికగా భారత నావికా దళంను పొగుడూతూ పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ అని చెబుతున్నారు.
Also Read : యుద్ధ పైలెట్స్ కు మా సెల్యూట్

ప్రముఖ ఆన్ లైన్ గేమ్ పబ్ జీ ని ప్రస్తావిస్తూ.. విన్నర్, విన్నర్ చికెన్ డిన్నర్ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

 

హ్యాపీ దివాళీ అంటూ పాకిస్తాన్ మంత్రికి మరికొందరు నెటిజన్లు ట్వీట్ లను చేస్తున్నారు. 
 

ఇక మరికొందరు భారత్ దాడి చేసిన జైష్ లో టపాసులు పేలాయని, ఇప్పుడు జైష్ ఎలా ఉందంటూ వెటకారం చేశారు.

 

జైష్.. హ్యాపీ దివాళీ, నీకు 1000కేజీ బాంబులను గిఫ్ట్ గా ఇచ్చాం తీసుకో అంటూ మరొక వ్యక్తి ట్వీట్ చేశారు.

మరికొందరు భారత నావికా దళంను పొగుడుతూ ట్వీట్ లు చేయగా.. ప్రముఖలు కూడా వారిని ప్రశంసిస్తూ ట్వీట్ లు చేస్తున్నారు.

Also Read : గో ఎహెడ్ అంటూ ఆదేశాలు : 30 నిమిషాల్లో కంప్లీట్ : స్వయంగా పర్యవేక్షించిన మోడీ