రైల్వే శాఖ శుభవార్త: అప్పటినుంచి బుక్ చేసుకున్న టిక్కెట్లన్నీ రద్దు..డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం

కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు గతంలో రైలు ప్రయాణం రద్దయిన ప్రయాణీకులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 14వ తేదీ నుండి ఆ తర్వాత రైళ్ల కోసం బుక్ చేసుకున్న టిక్కెట్లు బుక్ చేసుకున్న టిక్కెట్లు..అంతకంటే ముందు సాధారణ ప్యాసింజర్ రైళ్ల కోసం బుక్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేశామని.. దానికి సంబంధించిన డబ్బు మొత్తాన్ని పూర్తిగా తిరిగి ఇచ్చేస్తామని జూన్ 22న మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
టిక్కెట్లు రద్దు.. డబ్బులు వాపస్
ఏప్రిల్ 14వ తేదీ లేదా అంతకుముందు బుక్ చేసుకున్న అన్ని రైలు టిక్కెట్లను రద్దు చేసి..దానికి సంబంధించిన ఛార్జీని తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా రైల్వే శాఖ తెలిపింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 25వ తేదీ నుండి లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను అన్నింటిని రద్దు చేసింది.
బుకింగ్స్ నిలిపివేతకు ముందు జరిగిన పరిణామాలు..
ఏప్రిల్ 15వ తేదీ నుండి అన్ని సాధారణ రైళ్లలో బుకింగ్స్‌ను నిలిపివేసింది. దానికి ముందే మార్చి 25 నుండి రైళ్ల సర్వీసులు నిలిపివేసినందున ఆయా రైళ్లలో చేసుకున్న రిజర్వేషన్లను కూడా రద్దు చేసింది. ఏప్రిల్ 14వ తేదీ నుండి 120 రోజుల అనంతరం ప్రయాణించేందుకు ఉద్దేశించిన అన్ని టిక్కెట్లకు ప్రయాణీకులకు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తామని రైల్వే శాఖ తెలిపింది.
అత్యవసరం కోసం రైలు సౌకర్యాలు
మే 1వ తేదీ నుండి శ్రామిస్ స్పెషల్ రైళ్లను ప్రవేశ పెట్టి..అత్యవసర ప్రయాణాల కోసం ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారికోసం వివిధ మార్గాల్లో 230 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మే 12 నుంచి 30 ప్రత్యేక ఏసీ రైళ్లను..జూన్ 1నుంచి మరో 200 టైమ్ టేబుల్డ్ రైళ్లను ప్రారంభించింది.
Read: నేపాల్ గ్రామాలు,11వ్యూహాత్మక ప్రాంతాలను ఆక్రమించిన చైనా