INDIAN WOMAN ANJU : పాకిస్థాన్ విడిచి స్వదేశానికి వచ్చిన అంజూ…ఎందుకంటే…
తన ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు భర్త, పిల్లల్ని వదిలి పాకిస్థాన్ వెళ్లిన అంజూ ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి వచ్చింది. ఈ ఏడాది జులై నెలలో పాకిస్థాన్ వెళ్లిన అంజూ ఇప్పుడు వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చింది. 34 ఏళ్ల అంజూ తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి ఈ ఏడాది జులైలో పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తుంక్వాకు వెళ్లింది....

INDIAN WOMAN ANJU
INDIAN WOMAN ANJU : తన ఫేస్‌బుక్ స్నేహితుడిని కలిసేందుకు భర్త, పిల్లల్ని వదిలి పాకిస్థాన్ వెళ్లిన అంజూ ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి వచ్చింది. ఈ ఏడాది జులై నెలలో పాకిస్థాన్ వెళ్లిన అంజూ ఇప్పుడు వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వచ్చింది. 34 ఏళ్ల అంజూ తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి ఈ ఏడాది జులైలో పాకిస్థాన్ దేశంలోని ఖైబర్ పఖ్తుంక్వాకు వెళ్లింది. ఆ తర్వాత అంజు ఇస్లాం మతంలోకి మారిన తర్వాత నస్రుల్లాను పెళ్లి చేసుకున్నట్లు పాక్ మీడియా పేర్కొంది.
ALSO READ : Divorced couple : విడాకులు తీసుకున్న దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు…ఎందుకంటే…
అనంతరం పాకిస్థాన్‌ను విడిచిపెట్టడానికి ముందు అంజు ఓ రికార్డు వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పాకిస్థానీలు మంచి హోస్ట్‌లుగా ఉన్నందుకు ఆ దేశ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.‘‘ఇక్కడ అందరూ చాలా మంచివాళ్లే..అందరూ అందరినీ ప్రేమగా, గౌరవంగా ఆదరిస్తారు, బయటి నుంచి వచ్చారా అని ఆలోచించరు. ఎక్కడికి వెళ్లినా నాకు చాలా మంచి ఆతిథ్యం లభించింది’’ అని వీడియోలో అంజూ పేర్కొంది.
ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ నేపథ్యంలో ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం
భారతదేశంలో పిల్లలను వదిలి పాకిస్థాన్ వచ్చిన అంజూ మానసికంగా దెబ్బతిందని అందుకనే ఆమె తిరిగి భారతదేశానికి వెళుతుందని సెప్టెంబరు నెలలోనే ఆమె రెండవ భర్త నస్రుల్లా చెప్పారు. తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను వివాహం చేసుకోవడానికి జులైలో పాకిస్థాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు వాఘా సరిహద్దు మీదుగా స్వదేశానికి తిరిగి వచ్చింది. అంజు ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఆమెకు ఫాతిమా అనే కొత్త పేరు కూడా పెట్టారు.

ANJU
ALSO READ : Telangana Assembly Election 2023 : నేడే పోలింగ్.. సర్వం సిద్ధం చేసిన అధికారులు
‘‘నా భార్య అంజూ పిల్లలను వదిలి వచ్చినందున మానసికంగా తీవ్ర కలవరం చెందింది, అంజూకు తిరిగి భారతదేశానికి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు’’అని నస్రుల్లా చెప్పారు. అంజు మానసిక ఆరోగ్యం క్షీణించడం తనకు ఇష్టం లేదని నస్రుల్లా పేర్కొన్నారు. అంజు, నస్రుల్లా ఆగస్టులో వివాహం తర్వాత మొదటిసారి ఒక రోజు పర్యటన కోసం పెషావర్ వచ్చారు. పెషావర్‌లోని దిలీప్ కుమార్, షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజ భారతీయ చలనచిత్ర నటుల పూర్వీకుల ఇళ్లను చూడాలనే కోరికను అంజూ వ్యక్తం చేసింది.
ALSO READ : Telangana : పోలింగ్‌కు వరుణ గండం..! ఆందోళన నింపిన వాతావరణ కేంద్రం ప్రకటన
తాను పాకిస్థాన్ దేశంలో ఇంత మంచి పేరు తెచ్చుకుంటానని ఇక్కడికి రాకముందు తెలియదని అంజూ చెప్పింది. గతంలో రాజస్థాన్‌లో ఉన్న అరవింద్‌తో అంజు వివాహం జరిగింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. జైపూర్ వెళ్తున్నట్లు భర్త అరవింద్ కు చెప్పి అంజూ పాకిస్థాన్‌కు వెళ్లినట్లు భర్తకు తెలిపింది.