India COVID Cases : దేశంలో కరోనా కల్లోలం.. 25మిలియన్ల కేసులు.. 24గంటల్లో 4,329 మరణాలు

భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 25 మిలియన్ల మార్కును అధిగమించాయి. గత 24 గంటల్లో 263,533 కొత్త కేసులు నమోదయ్యాయి. COVID-19 మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత 24 గంటల్లో కరోనాతో 4,329 మంది మరణించారు.

India COVID Cases : దేశంలో కరోనా కల్లోలం.. 25మిలియన్ల కేసులు.. 24గంటల్లో 4,329 మరణాలు

India’s Covid Cases Cross 25 Million, Deaths Rise By Record 4,329

Updated On : May 18, 2021 / 12:56 PM IST

India COVID cases 25 million : భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసులు 25 మిలియన్ల మార్కును అధిగమించాయి. గత 24 గంటల్లో 263,533 కొత్త కేసులు నమోదయ్యాయి. COVID-19 మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. గత 24 గంటల్లో కరోనాతో 4,329 మంది మరణించారు. కరోనా కేసుల్లో అమెరికా తరువాత భారతదేశం ప్రపంచంలో రెండవ దేశంగా భారత్ అవతరించింది. దేశ మొత్తం కరోనా కేసులు ఇప్పుడు 25.23 మిలియన్లకు చేరాయి. కరోనాతో మరణించిన వారి సంఖ్య 278,719 గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత వారంలో రోజువారీ కేసుల అధికారిక సంఖ్య తగ్గుముఖం పట్టింది.

సోమవారం (మే 17) రోజున కొత్త కరోనా కేసులు 281,386 గా నమోదయ్యాయి. ఏప్రిల్ 21 నుంచి మొదటిసారి కేసులు 3లక్షల కన్నా తక్కువకు పడిపోయాయి. అధికారిక గణాంకాలు కంటే అసలు కరోనా కేసులు, మరణాలు ఐదు నుండి 10 రెట్లు అధికంగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబరులో భారతదేశంలో మహమ్మారి మొదటి వేవ్ ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది.

ఫిబ్రవరిలో మళ్లీ సెకండ్ వేవ్ విజృంభిన తర్వాత గ్రామీణ పట్టణాల్లో తీవ్రంగా వ్యాపించింది. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రారంభంలో కరోనా తీవ్రతను కట్టడి
చేసేందుకు దేశంలో లాక్ డౌన్ విధించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలను వేగవంతం చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. COVID-19 కేసులను పర్యవేక్షించడానికి
ఫెడరల్ ప్రభుత్వం వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది.

భారత్‌లో కేవలం 40.4 మిలియన్ల మందికి లేదా జనాభాలో 2.9 శాతానికి పూర్తిగా టీకాలు అందాయి.మరోవైపు కరోనా నుంచి ఒకే రోజు 4,22,436 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,15,96,512 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 2,78,719 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 33,53,765 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.