Plane crash in Ahmedabad: ఇండియాలో డెడ్లీ ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవే..
ఇక 1976 అక్టోబర్ 12న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 171 క్రాష్ కావడంతో 95 మంది చనిపోయారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లున్న ఎయిరిండియా విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది (పైలట్, ఇతర సిబ్బంది) ఉన్నట్టు తెలిసింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. కొందరిని ఆస్పత్రికి తరలిస్తున్న వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో ఒకసారి ఇండియాలో జరిగిన డేంజరస్ ఫ్లైట్ యాక్సిడెంట్ల గురించి తెలుసుకుందాం.
- 1996 నవంబర్ 12న ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా చెప్పొచ్చు. సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్ కు చెందిన 763 విమానం… కజకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన 1907 విమానం రెండూ చాక్రి దాద్రి లో గాల్లోనే ఢీకొట్టాయి. కజకిస్తాన్ విమానం పైలెట్ చేసిన తప్పిదం వల్ల రెండు విమానాలు పరస్పరం ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న 349 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలసిపోయాయి.
- 1978 జనవరి 1న జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం కూడా భారతదేశ చరిత్రలో డెడ్లీ ఫ్లైట్ యాక్సిడెంట్లలో ఒకటి. ఎయిర్ ఇండియా 855ఫ్లైట్ ముంబైలోని బాంద్రా సముద్రతీరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 213 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మంగళూరులో జరిగిన మరో విమాన ప్రమాదంలో 158 మంది చనిపోయారు. దుబాయ్ నుంచి మంగళూరు వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రన్ వేను దాటిపోయి గోడను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో 158 మంది మృతిచెందారు. ఇక ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన మరో విమానం 1988 అక్టోబర్ 19న అహ్మదాబాద్ లోనే కుప్పకూలింది. అప్పుడు పైలెట్ తప్పిదం వల్ల జరిగిన ప్రమాదలో 130 మంది చనిపోయారు.
- ఇక 1976 అక్టోబర్ 12న ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 171 క్రాష్ కావడంతో 95 మంది చనిపోయారు. ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ఫ్లైట్ లో ఉన్న అందరూ చనిపోయారు. ఇక 1962లో ముంబైలోనే జరిగిన మరో ప్రమాదంలో 94 మంది చనిపోయారు. ముంబై వస్తున్న విమానం ఓ కొండను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
- 1990, ఫిబ్రవరి 14న బెంగళూరులో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ క్రాష్ అయింది. పైలట్ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 92 మంది చనిపోయారు.
- 1992 జూన్ 14న జపాన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ 472 పాలెం ఎయిర్ పోర్టు వద్ద క్రాష్ అయింది. 82 మంది ప్రయాణికులు, ముగ్గురు విమాన సిబ్బంది చనిపోయారు. తప్పుడు సిగ్నల్ ఇవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని జపాన్ ఆరోపించింది. అయితే, తమ ఆర్డర్స్ పైలట్ పట్టించుకోలేదంటూ ఇండియా ఆ ఆరోపణలను తిప్పికొట్టింది.