3D Printed Post Office : దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్ ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ భవనాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి అయ్యింది.

3D Printed Post Office : దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Bengaluru 3D-printed post office building

Updated On : August 18, 2023 / 4:54 PM IST

Bengaluru 3D Printed Post Office : టెక్నాలజీ వేగంగా దూసుకుపోతున్న కాలం. ఒక భవనం నిర్మానానికి నెలల సమయం పట్టే రోజులు పోయాయి. కేవలం రోజుల్లోనే భవనం కట్టడాలు పూర్తైపోతున్నాయి. 45 రోజుల్లోనే పూర్తయిన 1021 చదరపు అడుగుల భవనం నిర్మాణం జరిగిపోయింది. బెంగళూరులో నిర్మించిన త్రీడీ ప్రింటింగ్ పోస్టాఫీసు భవనాన్ని ( 3D-printed post office building) కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ( Union minister Ashwini Vaishnaw)ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి త్రీడీ పోస్టాఫీసు భవనాన్ని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు.

బెంగళూరు(Bengaluru)లోని హాలాసూర్ లో దేశంలోనే తొలి త్రీడీ పోస్టాఫీస్ బిల్డింగ్ ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం (ఆగస్టు 18,2023)ప్రారంభించారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో బెంగళూరులో ప్రింట్ చేసిన ఈ భవనాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి అయ్యింది. నిర్మాణ పనులకు సంబంధించిన వీడియోను మంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేశారు. త్రీడీ పోస్టాఫీసు భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతు..ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈ బిల్డింగ్ ఒక నిదర్శనమని అన్నారు. దేశానికి కొత్తదనాన్ని పరిచయం చేయడంలో బెంగళూరు ముందు ఉంటుందన్నారు. త్రీడీ పోస్టాఫీసు బిల్డింగ్ తో దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. ఇటువంటి భవనాల వల్ల సమయంతోపాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని అన్నారు.

Rajasthan Politcis: రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజేను పక్కన పెట్టేసిన బీజేపీ.. ఆమె లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నారా?

కాగా..బెంగళూరులోని హాలాసూర్ కేంబ్రిడ్జి లే అవుట్ లో 1021 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ త్రీడీ బిల్డింగ్ ను రూపొందించారు. ఎల్‌ అండ్ టీ కంపెనీ 3డి కాంక్రీట్ ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాన్ని పూర్తిచేసింది.

కాగా, 2023 ఏప్రిల్ లో తాము ప్రతిపాదించిన త్రీడీ బిల్డింగ్ ప్లాన్ కు బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ (బీఎంటీపీసీ) ఆమోదం తెలపగా.. ఐఐటీ మద్రాస్ సహకారంతో పూర్తిచేసినట్లు ఎల్ అండ్ టి కంపెనీ వెల్లడించింది.