సిక్కింలో తొలి గ్లాస్ స్కైవాక్

India’s first Glass Skywalk is perched high above mountains in Sikkim సిక్కింలో తొలి గ్లాస్ స్కైవాక్ అందుబాటులోకి వచ్చింది. సముద్ర మట్టానికి 7,200 అడుగుల ఎత్తులో సిక్కింలోని పెల్లింగ్‌లో 137 అడుగుల ఎత్తైన చెన్రెజిగ్ విగ్రహానికి కుడివైపున దీనిని నిర్మించారు. పర్యాటకులు చెన్రెజిగ్ విగ్రహం, దానిపైకి వెళ్ళే మెట్లు, బంగారు ప్రార్థన చక్రాల యొక్క విస్తృత దృశ్యాన్ని అందించే ఉద్దేశంతో స్కైవాక్ నిర్మించారు
అద్భుతమైన హిమాలయాల మధ్య నెలకొల్పిన గ్లాస్ స్కైవాక్..సుందరమైన బౌద్ద మత పుణ్యక్షేత్రం యొక్క ఆకర్షణను మరింత పెంచనున్నది. ఈ ప్రాజెక్టుకు సిక్కిం సాంస్కృతిక శాఖ, భవనాలు, గృహనిర్మాణ శాఖ పర్యవేక్షణలో నిధులు సమకూర్చారు.
సిక్కిం స్కైవాక్..దేశంలోనే మొదటి గ్లాస్ స్కైవాక్. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా వృద్ధిలోకి రావడం ఖాయమని స్థానికులు భావిస్తున్నారు. కాగా, బీపీ ఎక్కువగా ఉన్నవారు, హార్ట్ రేట్ తక్కువగా ఉన్నవారు ఈ గ్లాస్ స్కైవాక్‌పై నడవటం శ్రేయస్కరం కాదని నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.