IVF buffalo calf: ఐవీఎఫ్ పద్ధతిలో లేగదూడ.. దేశంలో ఇదే తొలిసారి!

ఐవీఎఫ్ (in-vitro fertilization) పద్ధతిలో బిడ్డకు జన్మనివ్వడం అనేది ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. మహిళ యొక్క ఎగ్స్ రిమూవ్ చేసి.. ఫర్టిలైజేషన్ తర్వాత..

IVF buffalo calf: ఐవీఎఫ్ పద్ధతిలో లేగదూడ.. దేశంలో ఇదే తొలిసారి!

Ivf Buffalo Calf

Updated On : October 23, 2021 / 7:14 PM IST

IVF buffalo calf: ఐవీఎఫ్ (in-vitro fertilization) పద్ధతిలో బిడ్డకు జన్మనివ్వడం అనేది ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. మహిళ యొక్క ఎగ్స్ రిమూవ్ చేసి.. ఫర్టిలైజేషన్ తర్వాత సర్జికల్ ప్రొసీజర్ ద్వారా నీడిల్‌తో ఎగ్స్ ని తీసి స్పెర్మ్ ని కలెక్ట్ చేసి తిరిగి రెండింటినీ ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోనిని మహిళ యొక్క కడుపులోకి పంపించే విధానాన్ని ఐవీఎఫ్ అంటారు. సంతాన భాగ్యం పొందలేని ఎందరికో ఇది ఒక వరంగా కూడా చెప్పుకుంటారు. సహజ పద్ధతిలో పిల్లల్ని కనలేని వారు ఈ ఐవీఎఫ్ పద్ధతిలో తల్లిదండ్రులుగా మారతారు.

Husband sold Wife: ఎఫ్‌బీలో లవ్.. పెళ్లి.. ల‌క్షా 80 వేల‌కు భార్యను అమ్మేసిన మైనర్ భర్త!

అయితే.. ఇప్పటి వరకు మన దేశంలో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మనుషులకే సంతాన భాగ్యం కలుగగా.. ఇప్పుడు తొలిసారి గేదెలలో కూడా ఐవీఎఫ్ ద్వారా సంతాన భాగ్యాన్ని కల్పించారు. గుజరాత్ కచ్ జిల్లాలో గిర్​సోమ్​నాథ్​లోని ధనేజ్​ గ్రామానికి చెందిన పాడి రైతు బన్ని బ్రీడ్​కు చెందిన గేదె ఐవీఎఫ్​ పద్ధతిలో మగ లేగదూడకు జన్మనిచ్చింది. దేశంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాగా జేకే ట్రస్ట్ ఎన్​జీఓ సహకారంతో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు పాడి రైతు వినయ్ వాలా వెల్లడించారు.

Odisha Andhra Border: సరిహద్దు వివాదం.. ఏపీ అధికారులతో ఒడిశా పోలీసుల వాగ్వాదం!

ఈ ప్రక్రియలో మొత్తం 18 గేదెల్లో ఐవీఎఫ్​ పద్ధతి ద్వారా పిండాలను అమర్చగా.. వాటిలో ఆరు గర్భం దాల్చాయి. అందులో ఒక్కటి ఇప్పుడు లేగదూడకు జన్మనిచ్చింది. గతంలో 2017లో దేశంలో తొలిసారి ఓ ఆవు ఐవీఎఫ్ పద్ధతిలో క్రిష్ణ అనే లేగదూడకు జన్మనివ్వగా.. అప్పుడు కూడా జేకే ట్రస్టే సహకారం అందించిందని గుర్తు చేశారు. ఈ బన్ని బ్రీడ్​ గేదె ఇది ఐవీఎఫ్ పద్ధతిలో లేగదూడకు జన్మనివ్వడంపై కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ ట్విట్టర్​ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ఈ గేదె యజమాని, సుశీల అగ్రో ఫామ్స్​కు చెందిన వినయ్​ ఎల్ వాలాకు శుభాకాంక్షలు తెలిపింది.