Israel issues warning : ఢిల్లీలో పేలుడు ఎఫెక్ట్…భారత్‌లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్‌లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు, మార్కెట్లకు వెళ్లరాదని ఆ దేశం సూచించింది....

Israel issues warning : ఢిల్లీలో పేలుడు ఎఫెక్ట్…భారత్‌లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Israel issues warning

Updated On : December 27, 2023 / 6:25 AM IST

Israel issues warning : ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్‌లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు, మార్కెట్లకు వెళ్లరాదని ఆ దేశం సూచించింది. న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం జరిగిన పేలుడు ఘటన అనంతరం ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి భారతదేశంలోని తన పౌరులకు ప్రయాణ సలహాను జారీ చేసింది.

రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకండి

న్యూఢిల్లీలోని చాణక్యపురి దౌత్యవేత్త ఎన్‌క్లేవ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన పేలుడులో ఎవరూ గాయపడలేదు. మంగళవారం సాయంత్రం 5:48 గంటలకు తమ దేశ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించింది. ఢిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి గై నిర్ చెప్పారు. ఇజ్రాయెల్ పౌరులు బహిరంగ ప్రదేశాలైన రెస్టారెంట్‌లు, హోటళ్లు, పబ్‌లలో మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా ఆ దేశం కోరింది.

ALSO READ : Covid guidelines : మాస్కులు, వ్యాక్సిన్, ఐసోలేషన్…ఇవీ సర్కార్ తాజా కొవిడ్ మార్గదర్శకాలు

ఇజ్రాయెల్ చిహ్నాలను బహిరంగంగా ప్రదర్శించ రాదని, భారీ-స్థాయి ఈవెంట్‌లకు హాజరుకావద్దని ఇజ్రాయెల్ సూచించింది. రాయబార కార్యాలయానికి సమీపంలో ఉన్న సెంట్రల్ హిందీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వెలుపల గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో పేలుడు సంభవించిన వెంటనే ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక శాఖ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ALSO READ : Ram Temple in Ayodhya : పవిత్ర అయోధ్య రామాలయాన్ని చూసొద్దాం రండి

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందం కూడా స్థలాన్ని పరిశీలించిందని న్యూఢిల్లీలోని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పేలుడు సంఘటన తర్వాత ఎంబసీ, ఇతర ఇజ్రాయెల్ సంస్థల చుట్టూ భద్రతను మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు.ఇజ్రాయెల్,హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రత పెంచామని భద్రతా అధికారులు తెలిపారు.