Aditya-L1 Success : ఇస్రో మరో ఘనత.. ఆదిత్య ఎల్-1 ప్రయోగం సక్సెస్.. ప్రధాని మోదీ అభినందన
సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది.

ISRO first sun mission Aditya L1 enters final orbit
ISRO’s Aditya L1 Success : సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది. 125 రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఆదిత్య ఎల్-1 సూర్యుడి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి చేరుకుంది. శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరోసారి థ్రస్టర్లను మండించి హాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ శాటిలైట్ ఇక్కడి నుంచే సూర్యుడిని నిరంతరం పర్యవేక్షిస్తుంది.
కాగా.. ఈ ప్రయోగం విజయం కావడం పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను అభినందించారు. ‘భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 దాని గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధారణ విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనం కోసం, శాస్త్రసాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకునే ప్రయాణం కొనసాగుతోంది.’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
Aditya-L1: ఆదిత్య-ఎల్1.. ఏ రోజు ఏం జరిగిందో, ఇకపై ఏం జరగనుందో తెలుసా?
India creates yet another landmark. India’s first solar observatory Aditya-L1 reaches it’s destination. It is a testament to the relentless dedication of our scientists in realising among the most complex and intricate space missions. I join the nation in applauding this…
— Narendra Modi (@narendramodi) January 6, 2024