తేజస్వీ 10లక్షల ఉద్యోగాల హామీ ‘అంతా బోగస్’ : నితీష్

Nitish Kumar On Tejashwi Yadav’s 10 Lakh Jobs Promise బీహార్ సీఎం నితీశ్‌కుమార్..ఎన్నికల ప్రచారంలో మరోసారి సహనాన్ని కోల్పోయారు. తన ప్రత్యర్థి ఆర్‌జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆర్‌జేడీ కూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇటీవల ఎన్నికల ప్రచారంలో తేజస్వీయాదవ్ ఇచ్చిన హామీ అంతా బూటకమని నితీష్ అన్నారు. ప్రకటించింది. శుక్రవారం పర్భట్టాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్న నితీష్… తేజస్వియాదవ్ 10 లక్షల ఉద్యోగాలు అన్న మాట కేవలం బోగస్ అని విమర్శించారు.
తేజస్వీ తల్లిదండ్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, అప్పుడు బీహార్ ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని నితీష్ విమర్శించారు. వారి ప్రభుత్వంలో 1990నుంచి 2005 మధ్య కేవలం 95,000 జాబ్స్ మాత్రమే ఇచ్చారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించామన్నారు. ఆర్జేడీ చెప్పేదంతా బోగస్ మాటలని కొట్టిపడేశారు.
అయితే ఈ ఎన్నికల్లో… బీజేపీ కూటమి కూడా 4 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు… 15లక్షల ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో ఉద్యోగ ప్రకటన కీలక పాత్ర పోషించనుంది.
ఇక బుధవారం నాడు బీహార్‌లో తొలివిడత పోలింగ్ జరగనుంది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో భాగంగా మొదటి దశలో బుధవారం 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. నవంబర్-3న రెండో దశలో భాగంగా 94స్థానాలకు, మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీచేస్తుండగా..ఆర్‌జేడీ-కాంగ్రెస్-మూడు లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. ఇక,కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(LJP)స్వతంత్రంగా పోటీ చేస్తోంది.
ఎన్డీయే కూటమిలో ప్రధాన పార్టీలైన బీజేపీ 110సీట్లలో పోటీలో ఉండగా,జేడీయూ 115అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక, మహాఘట్ బంధన్ కూటమిలో ప్రధాన పార్టీలైన ఆర్జేడీ 114స్థానాల్లో బరిలోకి దిగుతుండగా,70స్థానాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంది. మరోవైపు, 143స్థానాల్లో మాత్రమే ఎల్జేపీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది.