మరో మైలురాయికి చేరువగా ప్రధాని పథకం

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 12:22 PM IST
మరో మైలురాయికి చేరువగా ప్రధాని పథకం

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ పథకం మరో మైలురాయి చేరేందుకు సిద్ధం అవుతుంది. ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ‘జన్ ధన్ యోజన’ పథకాన్ని 2014 ఆగస్టులో ప్రారంభించగా.. ఈ ‘జన్ ధన్ యోజన’ ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.1 లక్ష కోట్లను చేరుకోనుంది. మార్చి నెలాఖరు నాటికే ఇది రూ.1 లక్ష కోట్ల మైలురాయిని చేరుకునే అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శివ ప్రతాప్ శుక్లా వెల్లడించారు.

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాల్లో పొదుపు మొత్తాలు నెల రోజుల వ్యవదిలో రూ.88,566 కోట్ల నుంచి రూ.92,678 కోట్లకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అధికార గణాంకాల ప్రకారం జనవరి 23 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఈ ఖాతాల్లో రూ.4000 కోట్లు చేరినట్లు చెప్పారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే సాయం వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా చేరనుండడంతో జన్ ధన్ యోజన ఖాతాల్లో జమ అయిన మొత్తం ఈ నెలలో భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రతీ ఒక్కరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ ప్రతిష్టాత్మక పథకాన్ని తీసుకురాగా గతంలో ‘జన్ ధన్ యోజన’ ఖాతాల్లో 0 బ్యాలెన్స్ మాత్రమే ఉండడం పట్ల పలు విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఖాతాదారులకు రూ.10వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కల్పించింది. ప్రమాద బీమా వసతిని రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచడంతో ఘననీయమైన మార్పులు వచ్చాయి.