దేశం కోసం 200 మంది సింగర్లు కలసి పాడిన పాట

చారిత్రక గీతం Jayatu Jayatu Bharatam పాడేందుకు 200 మందికి పైగా సింగర్లు ఏకమయ్యారు. ఆశా బోస్లే, సోనూ నిగమ్ లాంటి స్టార్ సింగర్లంతా ఏకమై పాడిన పాటకు అమితమైన స్పందన లభిస్తుంది. “Jayatu Jayatu Bharatam, Vasudev Kutumbakkam”అని 14 భాషల్లో పాడిన పాటకు ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరు లేచి నిలబడి వారి సెల్యుటేషన్ ను తెలియజేయాలి. ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి ఇదే సరైన సమయం. జాగా హువా భారత్ పాట మానవత్వంపై ఏర్పడిన సంక్షోభ సమయంలో మనస్సులు గెలుచుకుంటుంది.
కరోనావైరస్ నేపథ్యంలో కొనసాగుతున్న లాక్‌డౌన్ సందర్భంగా సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. పాటపై ఇలా స్పందించారు. ‘ఇటువంటి క్లిష్ట సమయంలోనూ దేశం కోసం పని చేస్తున్న ప్రతి భారతీయుడికి సెల్యూట్ తెలియజేస్తున్నాం. దేశం మరింత దృఢంగా మారింది. మనమింకా కచ్చితంగా మెరుగవుతాం’ అని అన్నారు.
సోనూ నిగమ్ ‘మన దేశ అభిమానులను, పౌరులను గౌరవించడం మన విధి’ అంటూ చెప్పొకొచ్చారు. ఇలా పలువురు సింగర్లు పాడిన పాటను ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ (ISRA)రాశారు. అందులో శంకర్ మహదేవన్, ప్రసూన్ జోషి కూడా ఉన్నారు. ఈ పాటను మే 17న ప్లాన్ చేసి రిలీజ్ చేసినట్లుగా వెల్లడించారు.
వన్ నేషన్ వన్ వాయీస్ – జయతు జయతు భారతం, వాసుదేవ కుటుంబక్కం అనేది కేవలం పాట మాత్రమే కాదు. ఇదొక ఉద్యమం. ఇది 100కు పైగా బ్రాడ్ కాస్టింగ్ చానెల్స్‌లో టెలికాస్ట్ అవుతుంది. సోషల్, టెక్నికల్ ప్లాట్ ఫాంలు ఈ లాంచ్ ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అని సుక్రీత్ సింగ్ అన్నారు.