Strange Marriage: కల్వర్టుతో బుడ్డోడికి వివాహం.. బొమ్మ బైక్‌పై ఊరేగుతూ భళే సందడి చేసిన బాలుడు ..

ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భూమ్‌ జిల్లాలోని పోట్కా ప్రాంతంలో వింత వివాహం జరిగింది. ఆ ప్రాంతంలో గిరిజన ప్రజలు మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు అఖన్న జాతర జుపుకుంటారు. ఆ ప్రాంతంలోని గిరిజన కుటుంబాల్లో జన్మించిన పిల్లలకు తొలి దంతం‌ పైదవడకువస్తే వారికి చెట్టుకు లేకుంటే కల్వర్టుకు ఇలా వివాహం జరిపిస్తారు. అయితే...

Strange Marriage: కల్వర్టుతో బుడ్డోడికి వివాహం.. బొమ్మ బైక్‌పై ఊరేగుతూ భళే సందడి చేసిన బాలుడు ..

Strange Marriage in Jharkhand

Updated On : January 19, 2023 / 8:16 AM IST

Strange Marriage: దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు పలు రకాల ఆచారాలు ఆచరిస్తుంటారు. వాటిల్లో కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటి వింత ఆచారం ఝార్ఖండ్ రాష్ట్రంలో కనిపించింది. ఐదేళ్లలోపు బాలుడికి ఓ కుటుంబం వింత వివాహం చేసింది. చెట్టుకు, ఇతరకు ఇచ్చి వివాహం చేయడం కాదు.. ఏకంగా గ్రామంలోని కల్వర్టుతో బుడ్డోడికి వివాహం జరిపించారు. బాలుడుసైతం బొమ్మ బైక్‌పై పెళ్లికొడుకులా ఊరేగుతూ సందడి చేశాడు. ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్భూమ్‌ జిల్లాలోని పోట్కా ప్రాంతంలో ఈ అరుదైన వివాహం జరిగింది. ఆ ప్రాంతంలో గిరిజన ప్రజలు మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు అఖన్న జాతర జుపుకుంటారు. ఆ ప్రాంతంలోని గిరిజన కుటుంబాల్లో జన్మించిన పిల్లలకు తొలి దంతం‌ పైదవడకువస్తే వారికి చెట్టుకు లేకుంటే కల్వర్టుకు ఇలా వివాహం జరిపిస్తారు.

Strange marriage : భర్తకు విడాకులిచ్చి మామను పెళ్లి చేసుకున్న కోడలు..!

పోట్కా ప్రాంతానికి చెందిన సరీ సింగ్ సర్దార్ తన మనవడికి ఈ వింత వివాహం జరిపించాడు. అచ్చం పెళ్లికొడుకులా బుడ్డోడిని ముస్తాబు చేశారు. ఆ తరువాత బైక్ పై ఊరేగింపుగా కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగించారు. బుడ్డోడు బైక్ పై ఉన్నప్పుడు ఎండ తగలకుండా గొడుగు పట్టారు. కల్వర్టు వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లి వివాహ తంతు జరిపించారు. స్థానిక ప్రజలు ఈ వింత వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అవి వైరల్ గా మారాయి.

Strange Tradition : కుటుంబంలో ఎవరు చనిపోయినా..ఆ ఇంట్లో మహిళల చేతివేళ్లు కోసివేసే భయంకర ఆచారం..

ఈ వింత ఆచారంపై సరీ సింగ్ సర్ధార్ మాట్లాడుతూ.. మా పూర్వీకులు చెప్పినట్లుగా తాము నడుచుకుంటున్నామని తెలిపాడు. కింది దవడకు తొలి దంతం వచ్చిన పిల్లలకు ఇలాంటి వివాహం జరిపించమని, మా ఆచారం ప్రకారం పై దడవకు తొలి దంతం వచ్చినప్పుడు మాత్రమే ఇలా వివాహం చేస్తామని తెలిపాడు. అబ్బాయి, అమ్మాయి ఎవరైనా ఇలానే పెళ్లి జరిపిస్తామని, ఒకవేళ ఇలా పెళ్లి జరిపించకుంటే పిల్లలు పెద్దై పెళ్లిచేసుకున్న కొన్ని రోజులకే వారి భర్త లేదా భార్య చనిపోతారని పెద్ద చెప్పేవారని అన్నాడు. దీంతో అశుభం జరగకుండా ఇలా వింత వివాహం జరిపిస్తామని, ఇలాంటి సంప్రదాయం మా దగ్గరే కాకుండా.. ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లోనూ గిరిజనులు ఆచరిస్తుంటారని సరీ సింగ్ సర్దార్ చెప్పాడు.