Joshimath crisis: జోషిమఠ్‌లో ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించలేమన్న సుప్రీంకోర్టు.. పిటిషనర్‌కు సలహా ఇచ్చిన ధర్మాసనం..

న్యాయస్థానం జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు నిరాకరించింది. అయితే, పిటిషనర్ కు ధర్మాసనం కీలక సూచన చేసింది. ఈ పిటీషన్‌తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని తెలిపింది. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చని స్పష్టత ఇచ్చింది.

Joshimath crisis: జోషిమఠ్‌లో ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించలేమన్న సుప్రీంకోర్టు.. పిటిషనర్‌కు సలహా ఇచ్చిన ధర్మాసనం..

Joshimath crisis

Updated On : January 19, 2023 / 12:33 PM IST

Joshimath crisis: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ నగరంలో భూమి కుంగడంతో ఆ ప్రాంతంలో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. గత వారంరోజులుగా అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దాదాపు 750కుపైగా ఇళ్లుకు పగుళ్లు వచ్చాయి. కూలేందుకు సిద్ధంగా ఉన్న నివాసాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రోజురోజుకు సమస్య తీవ్రతరం అవుతుండటంతో అక్కడ కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కూల్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత హోటల్స్ కూల్చివేత ప్రక్రియ చేపట్టింది.

Uttarakhand: డేంజర్ జోన్‌లో జోషిమఠ్ .. ఇస్రో శాటిలైట్ ఉపగ్రహ చిత్రాలు విడుదల

జోషిమఠ్ ప్రాంతంలో భయానక ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించి, కేంద్రానికి పలు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ అవిముక్తేశ్వరానంద సరస్వతి అత్యుతన్న న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. దీనిపై సోమవారం సుప్రింకోర్టు విచారణ జరిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది.

 

అయితే, న్యాయస్థానం జోషిమఠ్ సంక్షోభాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు నిరాకరించింది. పిటిషనర్ కు ధర్మాసనం కీలక సూచన చేసింది. ఈ పిటీషన్ తో ఉత్తరాఖండ్ హైకోర్టుకు వెళ్లేందుకు స్వేచ్ఛ కల్పిస్తున్నామని తెలిపింది. అక్కడ పిటిషన్ వేసుకోవచ్చని స్పష్టత ఇచ్చింది.