జస్టిస్ దిశ : జాతీయ నేతలు ఏమన్నారంటే

దిశా హత్యాచారం కేసులో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. జాతీయస్థాయి నేతలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
జరిగింది అత్యంత దారుణ ఘటనగా అభివర్ణించారు. బీజేపీ ఎంపీ మేనకా గాంధీ. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరని, కోర్టు ఎలాగైనా ఉరి శిక్ష విధించేదన్నారు.
ఎన్ కౌంటర్ జరగడం ఆందోళన చెందాల్సిన విషయమన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోయిన విధానమని, న్యాయవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలనే దానిపై అన్ని ప్రభుత్వాలు కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దిశా..ఉన్నావ్ అత్యాచార ఘటనలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ప్రస్తుతం జరిగిన ఎన్ కౌంటర్‌పై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌ను స్వాగతిస్తున్నట్లు ఆర్జేడీ నేత రబ్రీ దేవి వ్యాఖ్యానించారు. బీహార్‌లో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
యూపీలో నేరాలు పెరిగిపోతున్నాయని, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పడుకుందని విమర్శించారు బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. నిందితులకు ఇలాంటి కఠిన చర్యలే సరైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలిసే వరకు ఖండించకూడదని శశిథరూర్ తెలిపారు.
బహుత్ డేర్ అయా..దురస్త్ అయే..డేర్ అయే..బహుత్ డేర్ అయా అన్నారు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్.
థాంక్యూ హైదరాబాద్ పోలీస్. రేపిస్టులను డీల్ చేసే పద్ధతి ఇదే. ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా మీ నుంచి నేర్చుకుంటారని ఆశిస్తున్నా బీజేపీ నేత కపిల్ మిశ్రా. ఇతరులు కూడా స్పందించారు.