Kalabagh Villagers : ‘గ్రామస్తుల వింత వ్రతం’..చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు..ఎక్కడికెళ్లాలన్నా కాలి నడకే..

సాధారణంగా ఇంట్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చాలని మొక్కుకుంటూ మహిళలు పూజలు,వ్రతాలు చేస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం గ్రామస్తులు మొత్తం వ్రతం చేస్తున్నారు. వారి గ్రామం క్షేమంగా ఉండాలని ఉన్న సమస్యలు పోవాలని కోరుకుంటూ వింత వ్రతం చేస్తున్నారు.

Kalabagh Villagers : ‘గ్రామస్తుల వింత వ్రతం’..చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు..ఎక్కడికెళ్లాలన్నా కాలి నడకే..

Kalabagh Villagers

Updated On : July 15, 2022 / 3:29 PM IST

Kalabagh Villagers Strange Strict Fasting : సాధారణంగా ఇంట్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చాలని మొక్కుకుంటూ మహిళలు పూజలు,వ్రతాలు చేస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం గ్రామస్తులు మొత్తం వ్రతం చేస్తున్నారు. వారి గ్రామం క్షేమంగా ఉండాలని ఉన్న సమస్యలు పోవాలని కోరుకుంటూ వింత వ్రతం చేస్తున్నారు. ఈ వ్రతంలో ప్రధాన నియమం ఏమిటంటే..కాళ్లకు చెప్పులు తొడుక్కోరు..మోటర్ బైక్ నడపరు…ఎంత దూరం వెళ్లాలన్నా కాలినడకే వెళుతుంటారు. ఇంతకీ ఈ వింత వ్రతం చేసే పద్ధతిలో  ఒకేమాట మీద ఉండి చాలా నియనిష్టలు పాటిస్తున్నారు గ్రామస్తులు.

అది కర్ణాటకలోని కాలేబాగ్ గ్రామం. విజయపుర పట్టణంలోని 30వ వార్డు పరిధిలో ఉంటుంది. ఈ గ్రామంలో పురుషులు గత కొంతకాలంగా వింత వ్రతం చేస్తున్నారు. ఆ వ్రతంలో నియమంలో భాగంగా చెప్పులు తొడగరు..బైక్‌లు నడపరు..ఎక్కడికెళ్లినా కాలి నడకనే ప్రయాణం సాగిస్తున్నారు. ఎందుకంటే కాలేబాగ్ గ్రామంలో కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బైక్‌లపై నుంచి ప్రమాదవశాత్తు పడిపోతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో కాలేబాగ్ గ్రామస్తులు ఏదో అరిష్టం సోకిందని అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రాణాలు కోల్పోతున్నారని నమ్ముతున్నారు.

Also read : Maharashtra : ఈభార్యలు మాకొద్దు బాబోయ్ అంటూ..’వట పౌర్ణమి వ్రతం’చేసిన భర్తలు

బైక్ లపై నుంచి పడి గాయాలపాలైనవారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో గ్రామానికి అరిష్టం పట్టుకుందని భావించిన గ్రామస్తులు పురోహితుడిని విషయం అంతా వివరించారు. దీనికి పరిహారంగా ఏదోకటి చేయండి అంటూ కోరారు. దీంతో సదరు పూజారి ‘‘కాలేబాగ్ గ్రామ దేవతలైన జట్టింగేశ్వర, దుర్గాదేవిల పేరుతో వ్రతం ఆచారించాలని..ఈ వ్రతం నియమాలు పాటించాలని ఐదు వారాల పాటు గ్రామస్తులు ఎవరూ పాదరక్షలు (చెప్పులు, షూష్) ధరించరాదని..ఎటువంటి వాహనాలు నడపకూడదని ఈ నియమాలు పాటించాలని తెలిపారు.దానికి గ్రామస్థులు కూడా సరేనన్నారు. నిబంధనలు కనీసం రెండు నెలలపాటు పాటిస్తే గ్రామానికి పట్టిన పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. పూజారి తెలిపిన మేరకు కఠిన నిబంధనలు పాటిస్తున్నట్లు కాలేబాగ్‌ గ్రామస్థుడు పరశురామ పూజారి తెలిపారు.