kanpur couple: అయ్యో పాపం .. ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన.. ఏకంగా రూ.35కోట్లు పోగొట్టుకున్న వృద్ధులు..!
డబ్బులు తీసుకున్న తరువాత కొన్నిరోజులపాటు ప్రతీరోజూ థెరఫీకి రావాలని.. హెల్త్ చెకప్స్ చేస్తామని చెప్పారు. అయితే, ప్రతీరోజూ ఇలానే చేస్తుండటంతో ఓ కస్టమర్ కు ..

Rajeev Kumar Dubey and his wife Rashmi Dubey
kanpur couple Rs 35crores fraud: కొందరి ఆశలకు హద్దులేకుండా పోతుంది.. నమ్మశక్యం కాని వాటికోసం ఆశపడుతూ కోట్లాది రూపాయలు పోగొట్టుకోవటంతోపాటు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీరి ఆశలను ఆసరాగా చేసుకొని మోసగాళ్లు కొత్తకొత్త మోసాలతో రెచ్చిపోతున్నారు. పెద్దెత్తున ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఘటన గురించి తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. టైం మెషిన్ ద్వారా వయస్సు తగ్గిస్తామని మోసగాళ్లు చెప్పిన మాటలు నమ్మి కొందరు వృద్ధులు ఏకంగా రూ. 35కోట్లను పోగొట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : ManuBhaker: తొలిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మనుభాకర్.. పోలింగ్ బూత్ ఏం చేసిందో తెలుసా.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో రాజీవ్ దూబే, రష్మీ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు కిద్వాయ్ నగర్ లో రివైవల్ వరల్డ్ పేరుతో థెరఫీ సెంటర్ నిర్వహిస్తున్నారు. మేము 60ఏళ్ల వయసున్న వారిని 25ఏళ్ల వ్యక్తులుగా మార్చేస్తామని స్థానికంగా ప్రచారం చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన మిషన్ ను తెచ్చామని నమ్మించారు. వారు చెప్పిన మాయమాటలను నమ్మిన స్థానికంగా ఉన్న పలువురు వృద్ధులు కనీసం ఆలోచన కూడా చేయకుండా రాజీవ్ దూబే దంపతులకు డబ్బులు చెల్లించారు. మీద్వారా వేరేవారికి రిఫర్ చేసి వారితోనూ డబ్బులు కట్టిస్తే మీకు డిస్కౌంట్ ఇస్తామని నమ్మించారు. దీంతో దాదాపు 40 మందికిపైగా వృద్ధులు దాదాపుగా రూ.35కోట్లు చెల్లించారు.
డబ్బులు తీసుకున్న తరువాత కొన్నిరోజులపాటు ప్రతీరోజూ థెరఫీకి రావాలని.. హెల్త్ చెకప్స్ చేస్తామని చెప్పారు. అయితే, ప్రతీరోజూ ఇలానే చేస్తుండటంతో ఓ కస్టమర్ కు అనుమానం వచ్చింది. ఆమె వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాలు తెలుసుకొని విస్తుపోయారు. అయితే, పోలీసులకు సమాచారం అందిన విషయం ముందే తెలుసుకున్న రాజీవ్ దూబే, అతడి భార్య పరారయ్యారు. అత్యాశకు పోయి డబ్బులు చెల్లించిన 40 మంది బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.