PM Modi : పొలం బురదలో కూరుకుపోయిన ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ ..

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మోదీకి సెక్యూరిటీగా వచ్చిన ఎస్కార్ట్ హెలికాఫ్టర్ బురదలోకూరుకుపోయింది. పొలం అంతా బురద బురదగా ఉండటంతో హెలిప్యాడ్ కూరుకుపోయింది.

PM Modi : పొలం బురదలో కూరుకుపోయిన ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ ..

Modi escort helicopter stuck

Updated On : May 3, 2023 / 11:50 AM IST

PM Modi : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న మోదీ మెరుపులా పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు సభల్లో పాల్గొంటున్నారు. కన్నడ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. దీంట్లో భాగంగా ప్రధాని మోదీ రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు రాగా.. ఈ పర్యటనలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా పొలంలోని బురదలో మోడీ ఎస్కార్ట్ హెలికాప్టర్ కూరుకుపోయింది. పొలం అంతా బురద బురదగా ఉండటంతో హెలిప్యాడ్ కూరుకుపోయింది. హెలిప్యాడ్ మీద ల్యాండ్ అయిన హెలికాప్టర్ తిరిగి గాల్లోకి లేవలేకపోయింది. టేకాఫ్ కాలేకపోయింది.

దీంతో దాన్ని బయటకు తీయటానికి నానా పాట్లు పడ్డారు. సెక్యూరిటీ గార్డులతో పాటు స్థానిక బీజేపీ నేతలు, పోలీసులు, స్థానికులు దాన్ని బయటకు తీయటానికి జేసీబీను ఉపయోగించాల్సి వచ్చింది. రాయచూర్ జిల్లాలోని సింథనూరులో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించటానికి హెలికాప్టర్ లో వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో..ల్యాండైన హెలికాప్టర్ టేకాఫ్ కాలేకపోయింది.

బురదలో కూరుకుపోవటం వల్ల గాల్లోకి లేవలేకపోయింది.దీంతో ఓ జేసీబీ తీసుకొచ్చారు. 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్ ను బురద నుంచి చాలా శ్రమపడి ఎట్టకేలకు బయటికి లాగారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ కు ఇటువంటి పరిస్థితి ఎదురైందనే విమర్శలు వస్తున్నాయి.

కాగా కర్ణాటకలోని కలబురగిలో రోడ్‌షోకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులతో ముచ్చటిస్తు మోదీ కూడా చిన్నపిల్లాడిలా వారితో పాటు చేతులతో విన్యాసాలు చేస్తు ఆటలాడారు.