నిరాడంబరంగా మాజీ సీఎం కొడుకు పెళ్లి
కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా

కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా
కరోనా వైరస్ నివారణకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. దీంతో శుభకార్యాలు, పెళ్లిళ్లు కూడా వాయిదా పడుతున్నాయి. ఇదివరకే ముహూర్తాలు ఫిక్స్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అనుకున్న ముహూర్తానికే వివాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లోవ్స్ ధరించి వధూవరులు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. పెళ్లి తంతుకు ముందు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. బంధుమిత్రులంతా మాస్క్ లతో పెళ్లికి హాజరవుతున్నారు. ఆఖరికి పంతులు కూడా మాస్క్ ధరించి పెళ్లి మంత్రాలు చదువుతున్నారు.
తాజాగా కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం(ఏప్రిల్ 17,2020) రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలో ఫాంహౌస్‌లో నిరాడంబరంగా జరుగుతోంది. గురువారం బెంగళూరులో వధువు, వరుడి నివాసంలో సందడి నెలకొంది. అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నా కరోనా లాక్‌డౌన్ అడ్డు వచ్చింది. పెళ్లికి తక్కువ సంఖ్యలో ఇరు కుటుంబాల పెద్దలు హాజరవుతున్నారు.
సాధారణంగా ప్రముఖుల ఇళ్లలో పెళ్లి అంటే ఓ రేంజ్ లో జరిపిస్తారు. ఆకాశమంత పందిరి వేస్తారు. వేలాది మందిని ఆహ్వానిస్తారు. అదీ మాజీ సీఎం ఇంట్లో పెళ్లి అంటే మాములూగా ఉండదు. చాలామంది ప్రముఖులు వస్తారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ అమల్లో ఉంది. అంతమంది ఒక్కచోట గుమికూడటం సరికాదు. దీంతో వీఐపీలైనా, సంపన్నులైనా.. చాలా సింపుల్ గా పెళ్లి జరిపిస్తున్నారు. కాగా, కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ గడువును మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.