ఖైదీల బ్యూటీ పార్లర్ : తక్కువ రేటుకే అన్నీ సర్వీసులు 

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 07:35 AM IST
ఖైదీల బ్యూటీ పార్లర్ : తక్కువ రేటుకే అన్నీ సర్వీసులు 

Updated On : December 19, 2019 / 7:35 AM IST

జైల్లో ఉండే ఖైదీలతో షేవింగ్, మసాజ్..మెనీక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారా? అమ్మో ఖైదీలతో ఇటువంటి సేవలా? వద్దు బాబోయ్ అని భయపడొద్దు. ఎందుకంటే ఖైదీలు చేసే ఈ సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. బైట షేవింగ్ చేయించుకోవాలంటే అయ్యే రేటు కంటే అతి తక్కువ ధరలకే వీరు చక్కగా షేవింగ్ చేస్తారు. పైగా చాలా చక్కగా స్పూత్ గా హ్యాండిల్ చేస్తారు. ఈ సదుపాయం కేరళలోని తిరువనంతపురంలోని ఖైదీలు నిర్వహించే ఈ  బ్యూటీపార్లర్ ఫుల్ రష్ గా ఉంటోంది. దీంతో  ఖైదీలు చేస్తున్న బ్యూటీ వర్క్ కు మంచి డిమాండ్ పెరిగింది. 

తిరువనంతపురంలోని పూజాపురా సెంట్రల్ జైలు అధికారులు జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) రిషిరాజ్ సింగ్, ఐపిఎస్ అధికారి శ్రీలేఖా ఖైదీలతో  సోమవారం (డిసెంబర్ 16) ఉదయం ‘Freedom Looks’ పేరుతో మెన్స్ బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించారు. దీంట్లో 20 మంది ఖైదీలు ఫిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు.

గతంతో ఖైదీలను ఉంచి ఈ భవనం ఇప్పుడు ఖాళీ గా ఉంటున్న ఈ భవనంలో ప్రారంభించిన ఈ పార్లర్‌లో పింక్ కలర్ యూనిఫాం వేసుకున్న ఖైదీలు..అదే కలర్ తో డిజైన్ చేసిన పార్లర్ లో  కష్టమర్లకు  హెయిర్ కటింగ్, షేవింగ్ తో పాటు స్పా, మెనీక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్ వంటి సేవలు చేస్తున్నారు. ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ సహాయంతో మగ ఖైదీలకు ఐపిఎస్ అధికారి శ్రీలేఖా బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇప్పించారు. తరువాత వారికి ఉపాధి కోసం ఈ పార్లర్ ను రూ. 9 లక్షలు ఖర్చు చేసి ప్రారంభించారు. 

మార్కెట్‌లో ఉన్న మేల్ బ్యూటీ పార్లర్లతో పోల్చుకుంటే అతి తక్కువ ధరకే పార్లర్ సేవలు అందిస్తున్నామని ఖైదీలు తెలిపారు. ఈ సందర్భంగా జైలు అధికారి రితీష్ ఆర్సీ మాట్లాడుతూ జైలులోని ఖైదీలందరికీ బ్యూటీషియన్ కోర్సులో ట్రైనింగ్ ఇప్పించామనీ..వీరంతా షిఫ్టులవారీగా ఇక్కడ పార్లర్ సర్వీసులు అందిస్తారని తెలిపారు. త్వరలో వృద్ధుల కోసం మసాజ్ సెంటర్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు.

కరడుకట్టిన మనస్సుతో ఉన్న ఖైదీలను ఇలా ఒకరికి సర్వీసు అందించేలా చేయటానికి తాము సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ లు ఇప్పించామనీ తెలిపారు. తరచు ఇచ్చే కౌన్సెలింగ్ లతో ఖైదీల మనస్సులో మంచి మార్పు వచ్చిందనీ దీంతో ఖైదీలు..వడ్రంగ్ పని నుంచి పార్లర్ పని వరకూ చక్కగా చేస్తున్నారనీ అది వారీ ఉపాధికి చాలా సహాయపడుతుదని తెలిపారు.  
ఖైదీలలో ఉండే ఆసక్తిని గమనించి వారిలో ఉండి ప్రతిభను గుర్తించి ఆయా పనుల్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని తెలిపారు. జైలు అనేది నిర్భంధించే స్థలంగా కాకుండా ఖైదీల్లో మంచి మార్పుకు దోహదం చేసేదిలా ఉండలనే ఉద్ధేశంతో వారి వారి ఆసక్తికి చెందిన వాటిలో ట్రైనింగ్ ఇప్పిస్తున్నామని వారుకూడా చక్కగా నేర్చుకుని పనిచేస్తున్నారని..చదువుమీద ఆసక్తి ఉన్నవారికి చదువు చెప్పిస్తున్నామని  జైలు సూపరింటెండెంట్ తెలిపారు.