మార్చి 31వరకూ కేరళ అంతా క్లోజ్.. ?

మార్చి 31వరకూ కేరళ అంతా క్లోజ్.. ?

Updated On : March 11, 2020 / 6:42 PM IST

కేరళను కొద్ది రోజుల పాటు క్లోజ్ చేయనున్నారు. కరోనా కేసులు 14కు చేరడంతో పలు ఆంక్షలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ గుమిగూడే పరిస్థితే లేదంటున్నారు అధికారులు. ఈ క్రమంలోనే విద్యాసంస్థలను మార్చి 31వరకూ మూసివేయాలని నిర్ణయించారు. 

ఇటీవల చేసిన వైద్య పరీక్షల్లో మూడేళ్ల అబ్బాయికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఇటీవల ఇటలీ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి కొచ్చిలోని హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పేషెంట్లు అంతా త్వరగానే కోలుకుంటున్నారు. 15వందల మందిని అబ్జర్వేషన్ లో ఉంచాం. వీరే కాకుండా 259మంది ఇతర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.

‘అందుబాటులో ఉన్న వనరులతో ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజల నుంచి సపోర్ట్ చాలా అవసరం. రెండేళ్ల క్రితం నిఫా వైరస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం. దీనిని కూడా అలాగే జయిస్తాం’ అని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ  అన్నారు. 

ఇటలీ నుంచి వస్తున్న ప్రయాణికుల కారణంగా కేరళ రాష్ట్ర పరిస్థితి ఇలా మారుతుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోడీకి లెటర్ ద్వారా ఐసోలేషన్ వార్డుల కోసం సహాయం చేయాలని కోరారు. ఇటలీ నుంచి ఇటీవల వచ్చిన వారి నుంచే ఎక్కువ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు అధికారులు బలవంతంగా తమకు వైరస్ లేదని సర్టిఫికేట్లలో రాయిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. 

See Also | ఖతర్‌లో ఒక్కరోజే 238 కరోనా కేసులు