ఢిల్లీ రైతు ఆందోళనకు మద్ధతుగా ట్రక్ నిండా పైనాపిల్స్ పంపిన కేరళ రైతులు

ఢిల్లీ రైతు ఆందోళనకు మద్ధతుగా ట్రక్ నిండా పైనాపిల్స్ పంపిన కేరళ రైతులు

Updated On : December 28, 2020 / 12:20 PM IST

Kerala to Delhi: ఢిల్లీలో రైతుల ఆందోళన రెండో నెలకు చేరుకోవడంతో వందలు, వేల కొద్దీ మద్ధతుదారులు పెరిగిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న వారికి భారీగా సపోర్ట్, లవ్ వస్తున్నాయి. ప్రతి రోజు ఇండియాలో ట్రీవెల్ చేస్తున్న వారు రైతు ఆందోళనకు సపోర్ట్ వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి పంజాబ్ నుంచి కొద్ది పాటి విరాళాలు కూడా సమర్పించి తమ వంతు సహాయం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే కేరళ నుంచి ఓ రైతుల గ్రూప్ మరోరకంగా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ట్రక్ నిండా ఉన్న పైనాపిల్స్ ను ఢిల్లీకి పంపి సపోర్ట్ తెలియజేసింది. దాదాపు 20 టన్నుల వరకూ పంపించినట్లు పైనాపిల్స్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ ట్రక్కును ఎర్నాకులం జిల్లా, వాఝాకులం నుంచి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వీఎస్ సునీల్ కుమార్ జెండా ఊపి పంపించారు.

సీజన్ పీక్‌లో ఉన్నప్పుడు 1400టన్నుల పైనాపిల్స్ దేశవ్యాప్తంగా అమ్మకాలు జరిపాయి వాఝాకులం ఫ్రూట్ మార్కెట్స్. ఇతర పంటల్లాగే వాఝాకులం పైనాపిల్ రైతులు కూడా లాక్ డౌన్ కు బాగా నష్టపోయారు. ఆశించనంత మేర పంట చేతికి రాకపోవడంతో ఆర్థిక నష్టంలో కూరుకుపోయారు.

ఆగష్టు నెలలో అప్పుల బాధకు ఓ రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. లీజ్ కు ఇచ్చిన ల్యాండ్ లో వ్యవసాయం చేసిన అనిల్ అనే వ్యక్తి కొవిడ్ సంక్షోభం తర్వాత పెద్ద ఎత్తులో నష్టాలు చవిచూశాడు. దాదాపు రూ.50లక్షల వరకూ అప్పుల్లో కూరుకుపోయాడు.