Canada : ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్‌సింగ్ నిజ్జర్‌‌కు పాక్ ఐఎస్ఐ శిక్షణ

ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్‌సింగ్ నిజ్జర్‌‌కు పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని భారత కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారతదేశం, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీసింది....

Canada : ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్‌సింగ్ నిజ్జర్‌‌కు పాక్ ఐఎస్ఐ శిక్షణ

Khalistani terrorist Hardeep Singh Nijjar

Updated On : September 23, 2023 / 12:02 PM IST

Canada : ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్‌సింగ్ నిజ్జర్‌‌కు పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చిందని భారత కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారతదేశం, కెనడా దేశాల మధ్య దౌత్య వివాదానికి దారితీసింది. కెనడియన్ గడ్డపై నిజ్జర్ ఖలిస్థాన్ యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చి, ఫైనాన్సింగ్ చేసినట్లు భారత నిఘా సంస్థలు రూపొందించిన రహస్య నివేదికలో వెల్లడైంది. (Nijjar had undergone training in Pakistan) నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఇద్దరు గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.

Canada : హిందువులకు కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే మద్ధతు

నిజ్జర్ (Khalistani terrorist Hardeep Singh Nijjar) పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సహాయంతో ఆ దేశంలో శిక్షణ పొందాడని తాజాగా వెల్లడైంది. (Nijjar had undergone training in Pakistan) భారతదేశంలోని ఇతర ఖలిస్తానీ నాయకులతో నిజ్జర్ సంబంధాలు కొనసాగించాడు. ఇతను పంజాబ్, భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడని గూడఛారి వర్గాలు తేల్చాయి. భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన నిజ్జర్‌ కెనడా దేశంలో ఆయుధ శిక్షణ శిబిరాలు నిర్వహించాడని కేంద్ర ఇంటెలిజెన్స్ తెలిపింది.

United Nations General Assembly : పీఓకేని ఖాళీ చేయండి, ఉగ్రవాదాన్ని ఆపండి : భారత్

ఏకే-47, స్పిపర్ రైఫిల్స్, పిస్టల్స్ ఉపయోగించడంలో ఇతను యువకులకు శిక్షణ ఇచ్చాడు. నిజ్జర్ 1996వ సంవత్సరంలో రవి శర్మ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌తో కెనడాకు పారిపోయి ట్రక్ డ్రైవర్, ప్లంబర్‌గా పనిచేశాడు. అతను కెనడాలో భారత వ్యతిరేక నిరసన ప్రదర్శనలు నిర్వహించాడు. ఇతను భారతీయ దౌత్యవేత్తలను కూడా బెదిరించాడని తాజాగా వెలుగుచూసింది. కెనడాలోని స్థానిక గురుద్వారాలు నిర్వహించే వివిధ కార్యక్రమాలకు భారత రాయబార కార్యాలయ అధికారులు హాజరుకాకుండా నిషేధించాలని కూడా నిజ్జర్ పిలుపునిచ్చారు.

Telangana Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెండు రోజులు కుమ్ముడే, హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్

ఖలిస్తానీ ఉగ్రవాది అయిన నిజ్జర్ కెనడాకు తనను స్పాన్సర్ చేసిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆ మహిళ 1997వ సంవత్సరంలో కెనడాకు వచ్చి మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. తదనంతరం 2007లో కెనడియన్ పౌరసత్వం పొందాడని పత్రం పేర్కొంది.

Nagpur flooded : నాగపూర్‌ను ముంచెత్తిన భారీవర్షం

నిజ్జర్ కు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకుడు, పాకిస్థాన్‌కు చెందిన కేటీఎఫ్ చీఫ్ జగ్తార్ సింగ్ తారాతో పరిచయం ఏర్పడిందని ఇంటెలిజెన్స్ తేల్చిచెప్పింది. 2018వ సంవత్సరంలో అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అందజేసిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో నిజ్జర్ పేరు ఉంది.