Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రాకు సమన్లు, విచారణకు వస్తారా ? అసలు ఎక్కడున్నారు ?

విమర్శల నేపథ్యంలో లఖింపూర్‌ ఖేరి దుర్ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు సమన్లు పంపించింది. ఆయన ఈ విచారణకు హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Lakhimpur Kheri : ఆశిష్ మిశ్రాకు సమన్లు, విచారణకు వస్తారా ? అసలు ఎక్కడున్నారు ?

Ajay Mishra

Updated On : October 8, 2021 / 9:59 AM IST

Union Minister Ajay Mishra Son : ఎట్టకేలకు పోలీసు యంత్రాంగం కదిలింది. దారుణం జరిగిన నాలుగు రోజుల తర్వాత స్పందించింది. చుట్టు ముడుతున్న విమర్శల నేపథ్యంలో లఖింపూర్‌ ఖేరి దుర్ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాకు సమన్లు పంపించింది. విచారణ నిమిత్తం 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు క్రైమ్‌ బ్రాంచ్‌ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసు జారీ చేసింది. విచారణకు స్వయంగా హాజరై లిఖితపూర్వకంగా, మౌఖికంగా, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌తో పాటు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆశిష్‌ మిశ్రా ఈ విచారణకు హాజరవుతారా? లేదా? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నాడనే విషయం తెలియడం లేదంటున్నారు. ఒకట్రెండు రోజుల నుంచి కనిపించడం లేదు.

Read More : Kerala : శబరిమల యాత్రకు భక్తుల అనుమతిపై కేరళ సర్కార్ కీలక నిర్ణయం

లఖింపూర్‌ దుర్ఘటనపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు చేస్తున్నాయి. ప్రధాన నిందితుడైన మంత్రి కుమారుడు ఆశిష్‌ను అరెస్టు చేయాలంటూ పదేపదే డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేయడంతో పాటు.. మరోవైపు జ్యుడీషియరీ ఎంక్వయిరీకి ఆదేశించింది ప్రభుత్వం. ఈ రోజు జరిగే విచారణకు ఆశిష్‌ హాజరవుతాడా? లేదా అనుమానాలుండగా.. విచారణకు రాకపోతే సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
మరోపక్క, ఈ కేసులో కీలక మలుపు తిరిగింది. యాక్సిడెంట్‌కు కారణమైన ఓ కారు నుంచి వినియోగించిన బుల్లెట్‌ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌ నిపుణల పరిశీలనలో మెటల్‌ డిటెక్టర్‌తో దుర్ఘటన జరిగిన ప్రాంతమంతా వెతికినప్పుడు ఇవి దొరికాయి.

Read More : Gauri Khan’s Birthday : తల్లి పుట్టిన రోజు..ఆర్యన్ ఖాన్‌‌కు బెయిల్ వస్తుందా ?

కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్‌ను తప్పించేందుకు బీజేపీ కార్యకర్తలు కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు రైతులు. పోస్టుమార్టమ్‌ నివేదికలో మాత్రం బులెట్‌ గాయాలతో ఎవరూ మరణించలేదని ఉంది. కానీ, బులెట్ల వినియోగానికి అవకాశం లేదని పూర్తిగా కొట్టి పారేయడానికి వీల్లేదని అంటున్నారు. విచారణ సరైన దిశలోనే కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరిని అరెస్టు చేసి, విచారిస్తున్నామని అంటున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురు పేర్లు బయటకు వచ్చాయి. వారిలో ముగ్గురు ఘర్షణల సందర్భంగా మరణించారు. ఈ కేసును విచారించేందుకు అలహబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌కుమార్‌ శ్రీవాస్తవను ప్రభుత్వం నియమించింది. రెండు నెలల్లో ఈ కేసును విచారించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఘటనలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, స్థానిక జర్నలిస్టు ఒకరు మరణించారు.