లోక్ సభ ఎన్నికల సెగ : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు

  • Published By: madhu ,Published On : March 8, 2019 / 01:36 AM IST
లోక్ సభ ఎన్నికల సెగ : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు

Updated On : March 8, 2019 / 1:36 AM IST

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడముందే రాజకీయ వేడి మొదలైపోయింది. ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను మార్చి 07వ తేదీ గురువారం సాయంత్రం రిలీజ్ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. రాయ్‌బరేలి నుంచి సోనియాగాంధీ, అమేథీ నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే తొలి జాబితాలో ప్రియాంకగాంధీ పేరును మాత్రం ప్రకటించలేదు.
Also Read : అద్బుతం జరిగింది : 118 ఏళ్ల బామ్మకు గుండె ఆపరేషన్

ఇక అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది. అహ్మదాబాద్‌ వెస్ట్‌ నుంచి రాజు పర్మర్, అనంద్‌ నుంచి భరత్‌సింగ్‌ సోలంకీ, వడోదర నుంచి ప్రశాంత్‌ పటేల్‌, ఛోటా ఉదయ్‌పూర్ నుంచి రంజిత్‌ మోహన్‌సింగ్‌ రత్వాను గుజరాత్‌ రాష్ట్రం లోక్‌సభ అభ్యర్థులుగా ఖరారు చేసింది హస్తం పార్టీ. 

ఉత్తర్ ప్రదేశ్ : 
ఇటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌ బరేలీ నుంచి సోనియాగాంధీ, అమేథీ నుంచి రాహుల్‌గాంధీ మరోసారి బరిలోకి దిగనున్నారు. ఇక మిగతా స్థానాల్లోని అభ్యర్థుల జాబితా ఈ విధంగా ఉంది. షరాన్‌పూర్ నుంచి ఇమ్రాన్‌ మసూద్‌, బదౌన్‌ నుంచి సలీం ఇక్బాల్‌ షెర్వానీ, దౌరాహరా నుంచి జితిన్‌ ప్రసాద్‌, ఉన్నావ్‌ నుంచి అన్ను టాండన్‌, ఫరూకాబాద్‌ నుంచి సల్మాన్‌ ఖుర్షీద్‌, అక్బర్‌పూర్‌ నుంచి రాజారాం పాల్, జలావున్‌ నుంచి బ్రిజ్‌లాల్‌ ఖబ్రీ, ఫైజాబాద్ నుంచి నిర్మల్‌ ఖత్రీ, ఖుషీ నగర్‌ నుంచి ఆర్పీఎన్‌ సింగ్‌లను ఖరారు చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. మొత్తానికి ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ దూకుడు పెంచారు. అభ్యర్థుల ప్రకటనతో దేశంలో ఎన్నికల సెగ రాజేశారు. 
Also Read : Sky for ALL : @ 799లకే విమాన టికెట్