వేశ్యలను తెచ్చి డ్యాన్స్‌లేయించాలా?:బీజేపీ ఎమ్మెల్యే నోటి దురద 

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 09:11 AM IST
వేశ్యలను తెచ్చి డ్యాన్స్‌లేయించాలా?:బీజేపీ ఎమ్మెల్యే నోటి దురద 

Updated On : March 3, 2019 / 9:11 AM IST

లఖ్‌నవూ: బీజేపీ నేతలు..ప్రజాప్రతినిథులు నోటి దురదతో వివాదాస్పదంగా మారుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లేడేస్తు..తాము ఒక బాధ్యాయుత స్థానంలో ఉన్నామని సంగతిని మరుస్తున్నారు.  ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఆగ్రహంతో ఊగిపోయి నోటికి పనిపెట్టారు. 
 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరిదాపూర్‌ ఎమ్మెల్యే శ్యామ్‌ బిహారీలాల్‌ తన నియోజకవర్గంలోని గ్రామ ప్రజలను కలిసేందుకు వెళ్లారు. వారితో మాట్లాడే సందర్భంగా..ఒక యువకుడు లేచి..ఓట్లు వేయించుకుంటున్నారు గానీ..మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం లేదు?’ అని ఎమ్మెల్యేని నిలదీశాడు. దీంతో ఆగ్రమంతో ఊగిపోయిన శ్యామ్ బిహారీ లాల్ నోటికొచ్చినట్లు మాట్లాడకు.. విద్యుత్తు రాలేదా? రోడ్లు లేవా? ఇవన్నీ..ఇదంతా డెవలప్ కాదా అభివృద్ధి అంటే ఇంకేం కావాలి? వేశ్యలను తీసుకొచ్చి ఇక్కడ మీతో డ్యాన్స్‌లు చేయించాలా?’ అంటు మండిపడ్డారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అలా మాట్లాడటంతో స్థానికులు మండిపడుతున్నారు.