పార్లమెంట్ కు పోటీ చేస్తున్నఆ అభ్యర్ధుల ఆస్తి ఎంతో తెలుసా ..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికి 3 విడతల్లో పోలింగ్ పూర్తవగా నాలుగవ విడత ఏప్రిల్ 29వ తేదీన జరుగుతుంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేయాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన వ్యవహారంగా ఎన్నికలు మారాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా అనధికారికంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టనిదే పనికానట్టు ఎన్నికల ప్రక్రియ మారిపోయింది. మరి అట్టాంటిది లోక్ సభ ఎన్నికలు అంటే ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి. అయితే అంత డబ్బులేక పోయినా ఎన్నికల్లో పోటీకి దిగారు కొంత మంది అభ్యర్ధులు. నాలుగో దశలో పోలింగ్ జరిగే మధ్యప్రదేశ్ లోని సిద్ది లోక్ సభ స్ధానం నుంచి పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్ధుల అఫిడవిట్ లో వారి ఆస్తులు చూస్తే ముక్కన వేలేసుకోవాల్సిందే.
సిద్ధి నుంచి పోటీ చేస్తున్న లలన్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద రూ.1823 విలువైన ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించాడు. అక్కడి నుంచే పోటీ చేస్తున్న మరో స్వతంత్ర అభ్యర్ధి రామ్ సహాయ్ తనకు రూ.6,134 విలువైన ఆస్తులు ఉన్నట్టు పేర్కోన్నాడు. జబల్ పూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధనుక్ అనే మరో వ్యక్తి తన ఆస్తుల మొత్తం విలువ రూ.10,300 గా చెపుతూ అఫిడవిట్ దాఖలు చేశాడు.