LPG Cylinder New Price: గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయ్.. వినియోగదారులకు శుభవార్త.. ఎంత తగ్గిందో తెలుసా? కానీ..
LPG Cylinder New Price: గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు చోటుచేసుకోవడం..
LPG Cylinder New Price
LPG Cylinder New Price: గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రతి నెల 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలలో మార్పులు చోటుచేసుకోవడం మనకు తెలిసిన విషయమే. దేశంలోని ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు, డాలర్ మారకపు విలువ, ఇతర ఆర్థిక అంశాలను పరిశీలించి గ్యాస్ ధరలను ప్రతీనెలా సవరిస్తుంటాయి. తాజా.. ఇవాళ (నవంబర్ 1వ తేదీ) గ్యాస్ ధరలను సవరించాయి.
గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. 19కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ పై కొంత ఉపశమనం కల్పించాయి. ఆ సిలిండర్ పై రూ.4.5 నుంచి రూ.6.5 వరకు తగ్గింది. గృహ అవసరాలకు ఉపయోగించే 14కిలోల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర గతంలో రూ.1,595.60 ఉండగా.. ఇప్పుడు రూ.1,590.50కు చేరింది. కోల్‌కతాలో రూ.1,694, ముంబైలో రూ.1,542, చెన్నైలో రూ.1,750. హైదరాబాద్‌లో రూ.1,812.50 వద్దకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు తగ్గాయని, డాలర్ విలువ కూడా తగ్గిందని నిపుణులు అంటున్నారు.
మరోవైపు.. గృహ ఎల్పీజీ సిలిండర్ (14 కేజీల) ధరల విషయానికొస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన వీటి ధరలను చివరిసారిగా సవరించారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా సిలిండర్‌కు రూ. 50 పెంపు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గృహ గ్యాస్ ధరల్లో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు.
దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో గృహ అవసరాల కోసం ఉపయోగించే వంట గ్యాస్ ధర రూ.850 నుంచి రూ.960 వరకు ఉంటుంది. ప్రస్తుతం దేశీయ ఎల్పీజీ సిలిండర్ ఢిల్లీలో రూ.853, ముంబైలో రూ.852.50, హైదరాబాద్ లో రూ.905గా ఉంది. చెన్నైలో రూ.868.50గా కొనసాగుతోంది.
