Madhya Pradesh Mine : ఇటుకల బట్టీ వ్యాపారికి దొరికిన రూ.1.2 కోట్ల విలువైన వజ్రం

ఇరవై ఏళ్లుగా వెతుకుతుంటే... ఇటుకల బట్టీ వ్యాపారికి 26.11 క్యారట్ల వజ్రం దొరికింది. దాని విలువ రూ.1.2 కోట్లు..

Madhya Pradesh Mine : ఇటుకల బట్టీ వ్యాపారికి దొరికిన రూ.1.2 కోట్ల విలువైన వజ్రం

Madhya Pradesh Panna Mine

Updated On : February 22, 2022 / 3:56 PM IST

Madhya pradesh Panna Mine : ఒక్క వజ్రం..ఒకే ఒక్క వజ్రం దొరికితే చాలా కోటీశ్వరులు అయిపోతారు. అలా వజ్రాల కోసం మధ్యప్రదేశ్ లోని పన్నా మైన్స్ లో వేయి కళ్లతో వెతుకుతుంటారు ఆశావహులు. అలా రోజువారి కూలీలకు లభ్యమైన వజ్రంతో వారి జీవితాలే మారిపోయిన ఘటనలో పలువురుకి దక్కింది. అలా ఓ వ్యక్తి 20 ఏళ్లుగా ఒక్క వజ్రం దొరికినా చాలు అని మధ్య ప్రదేశ్ పన్నా మైన్స లో వెదుకుతున్నాడు. కానీ రెండు దశాబ్దాలు గడిచిపోయిన అతనికి అదృష్టం తలుపు తట్టలేదు. అయినా ఆశ వీడక వెదుకుతునే ఉన్నాడు. అలా అతని 20 ఏళ్ల శ్రమ ఫలించింది. 1.2 కోట్ల విలువ కలిగిన 26.11 క్యారెట్ల వజ్రం దొరికింది…అంతే అతని ఆనందానికి అవధుల్లేవు.

Also read : woman finds rare diamond : పార్కులో వాకింగ్ చేస్తుంటే వృద్ధురాలికి దొరికిన అరుదైన వజ్రం

మధ్యప్రదేశ్ కు చెందిన సుశీల్ శుక్లా అనే వ్యక్తి ఇటుకల బట్టీ వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాడు. అలా పన్నా మైన్స్ లీజుకు తీసుకున్నాడు.అలా తన కుటుంబం 20 ఏళ్ల నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నా..అతనికి ఏనాడు ఒక్క వజ్రం కూడా దొరకలేదు.కానీ 20 ఏళ్లకు రూ.1.2 కోట్ల విలువైన వజ్రం దొరికింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లా కేంద్రంలోని కిషోర్ గంజ్ నివాసి అయిన సుశీల్ శుక్లా ఒకవైపు ఇటుక బట్టీ వ్యాపారం చేస్తూనే, మరోవైపు కృష్ణ కల్యాణ్ పూర్ ప్రాంతంలో గనిని లీజుకు తీసుకున్నాడు.

Also read :  Panna Diamond Mine 13.54 carats : పన్నా వజ్రాల గనుల్లో.. గిరిజన కూలీకి దొరికిన 60 లక్షల విలువైన వజ్రం

సోమవారం గని తవ్వకాల నుంచి బయటపడిన 26.11 క్యారెట్ల వజ్రం విలువ రూ.1.2 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్ని వేలం వేసి, విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని మినహాయించుకుని.. మిగిలినది ఇస్తామని అధికారులు ప్రకటించారు.

Also read : Chameleon Diamond: రంగులు మారుస్తున్న వజ్రం..సైటిస్టులు సైతం షాక్

తాను, తన కుటుంబం 20 ఏళ్ల నుంచి మైనింగ్ వ్యాపారంలో ఉన్నా, ఇంత పెద్ద వజ్రాన్ని ఏ రోజూ చూడలేదని శుక్లా తెలిపాడు. మరో ఐదుగురు భాగస్వాములతో కలసి చేస్తున్న మైనింగ్ ఎట్టకేలకు అతడి కష్టానికి తగ్గ ఫలితం లభించింది.

Also read : Mysterious Stone: బంగారం కోసం వెతికితే బండరాయి దొరికింది.. అదేంటో తెలిసి షాక్..