ఒక్కటే గుండె : రెండు తలలు..మూడు చేతుల బిడ్డ జననం

మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఓ మహిళకు రెండు తలల బిడ్డకు జన్మనిచ్చింది. గంజ్‌బాసోడా ఏరియాకు చెందిన బాబిత అహిర్వార్ అనే 21 ఏళ్ల మహిళకు సంవతసరం క్రితం వివాహం అయ్యింది. అనంతరం గర్భం దాల్చిన బాబితకు ఆదివారం (నవంబర్ 24)రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి.
రెండు తలలకు కూడా కళ్లు, చెవులు, నోరు ఉన్నాయి. కాగా..ఈ వింత బిడ్డ పుట్టిన తరువాత పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. తల్లి బాబితా ఆరోగ్యం బాగానే ఉంది. అయితే బాబితా గర్భంతో ఉన్నప్పుడు స్కానింగ్ చేసిన డాక్టర్లు కవలలు అని డాక్టర్లు నిర్ధారించుకున్నారు.
కానీ డెలివరీ తర్వాత రెండు తలల శిశువును చూసి డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. మిలియన్ మందిలో ఒకరికి ఇలా జన్మించే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం బిడ్డకు చికిత్స కొనసాగిస్తున్నారు డాక్టర్లు.